AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart: వైద్య శాస్త్రంలోనే అద్భుతం.. ఆగిన గుండెకు ప్రాణం పోసిన వైద్యులు

ఆగిన గుండెను తిరిగి పనిచేసేలా చేయడం అసాధ్యమనే విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అలాంటి సంఘటనలు జరిగినట్లు చూసింది లేదు. అయితే తాజాగా భువనేశ్వర్ ఎయిమ్స్‌‌కు చెందిన వైద్యులు అద్భుతం చేశారు. 9 గంటల తర్వాత ఆగిని గుండెకు తిరిగి కొట్టుకునేలా చేశారు..

Heart: వైద్య శాస్త్రంలోనే అద్భుతం.. ఆగిన గుండెకు ప్రాణం పోసిన వైద్యులు
Representative Image
Narender Vaitla
|

Updated on: Nov 19, 2024 | 7:56 AM

Share

మనిషి అన్ని సృష్టిస్తున్నాడు. మనిషిని పోలిన మరమనిషిని తయారు చేశాడు, ఆ మర మనిషికి ఆలోచించే శక్తిని ఇచ్చాడు. పోయినా ప్రాణాన్ని తిరిగి తెచ్చే అంశం తప్ప మిగతా అన్ని సాకారమవుతున్నాయి. అయితే తాజాగా భువనేశ్వర్‌లో పోయిన ప్రాణాన్ని తిరిగి నెలబెట్టిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 90 నిమిషాల పాటు ఆగిపోయిన గుండెను తిరిగి పునరుద్ధరించారు భువనేశ్వర్‌ ఎయిమ్స్‌ వైద్యులు.

వివరాల్లోకి వెళితే.. శుభాకాంత్ సాహు అనే 24 ఏళ్ల ఆర్మీకి చెందిన యువకుడు గత నెల 1వ తేదీన అనారోగ్య సమస్యలతో భువనేశ్వర్‌లోని ఎయిల్స్‌లో అడ్మిట్‌ అయ్యాడు. ఆసుపత్రికి చేరుకున్న కొద్ద సేపటికీ ఆయన గుండె పనిచేయడం ఆగిపోయింది. దీంతో వెంటనే అలర్ట్‌ అయిన వైద్యులు సీపీఆర్‌ను నిర్వహించారు. ఏకంగా 40 నిమిషాల పాటు సీపీఆర్‌ నిర్వహించినా ఎలాంటి ఫలితం లభించలేదు.

దీంతో శుభాకాంత్‌కు ఎక్స్‌ట్రాకార్పోరియల్‌ కార్డియో-పల్మనరీ రిససిటేషన్‌ (ఈసీపీఆర్‌) అనే ప్రత్యేకతమైన వైద్య విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. పలు చర్చల తర్వాత డాక్టర్‌ శ్రీకాంత్‌ బెహరా నేతృత్వంలోని బృందం ఎక్స్‌ట్రాకార్పోరియల్‌ మెంబ్రేన్‌ ఆక్సిజనేషన్‌ (ఎక్మో)తో చికిత్స ప్రారంభించింది. ఇలా 90 నిమిషాల ప్రయత్నం తర్వాత గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభమైంది. ఒకరకంగా చెప్పాలంటే శుభాకాంత్‌కు వైద్యులు పునర్జన్మ ఇచ్చారని చెప్పాలి.

అయితే వెంటనే గుండెకొట్టుకునే తీరు సరిగ్గా లేదు. 30 గంటల తర్వాత గుండె పనితీరు మెరుగైంది. 96 గంటల తర్వాత ఎక్మోను తొలగించారు. ఎక్మో విషయానికొస్తే.. గుండె, ఊపిరితిత్తుల పనితీరును వేరువేరుగా నిర్వర్తించేందుకు ఈ విధానాన్ని ఉపయోగిస్తారు. అయితే ఈ విధానం ఎన్నో సవాళ్లతో కూడుకుందని వైద్యులను చెబుతున్నారు. ప్రస్తుతం శుభాకాంత్ పూర్తిగా కోలుకున్నారని వైద్యులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..