Mallikarjuna Kharge: దుమారం రేపుతున్న “ప్రత్యేక దేశం”.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే రియాక్షన్ ఇదే..!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై విపక్షాలు అసహనం వ్యక్తం చేశాయి. సామాన్యులకు ఊరటనిచ్చే అంశం బడ్జెట్‌లో లేదని విమర్శించారు. అయితే, కర్ణాటక కాంగ్రెస్ నేత, లోక్‌సభ ఎంపీ డీకే సురేశ్ దక్షిణ భారతాన్ని ప్రత్యేక దేశంగా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ పార్లమెంటు వేదికగా చేసి ప్రకటన దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగుతోంది.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై విపక్షాలు అసహనం వ్యక్తం చేశాయి. సామాన్యులకు ఊరటనిచ్చే అంశం బడ్జెట్‌లో లేదని విమర్శించారు. అయితే, కర్ణాటక కాంగ్రెస్ నేత, లోక్‌సభ ఎంపీ డీకే సురేశ్ దక్షిణ భారతాన్ని ప్రత్యేక దేశంగా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ పార్లమెంటు వేదికగా చేసి ప్రకటన దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగుతోంది.
మధ్యంతర బడ్జెట్‌పై బెంగళూరుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ మాట్లాడుతూ.. ఇది ఎన్నికల బడ్జెట్ అని అన్నారు. పథకాలకు కొన్ని సంస్కృత పేర్లు, హిందీ పేర్లు ప్రవేశపెట్టారన్నారు. కేంద్రం దక్షిణ భారత రాష్ట్రాలకు జీఎస్టీ, ప్రత్యక్ష పన్నుల్లో వాటా ఇవ్వడం లేదని ఆరోపించారు. దక్షిణ భారత రాష్ట్రాలు అన్యాయానికి గురవుతున్నాయని, దక్షిణాది రాష్ట్రాల నుంచి వసూలు చేసిన సొమ్మును ఉత్తర భారత రాష్ట్రాలకు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇది ఇలాగే కొనసాగితే ప్రత్యేక దేశం కోసం డిమాండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు డీకే సురేశ్. కేంద్రం రాష్ట్రాల నుంచి రూ.4 లక్షల కోట్లకు పైగా వసూలు చేస్తోందని, దానికి ప్రతిఫలంగా అందుతున్నదీ స్వల్పం అన్నారు. దీన్ని సరిదిద్దుకోకుంటే దక్షిణాది రాష్ట్రాలన్నీ ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేస్తూ గళం విప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.
#WATCH | Congress president and LoP Rajya Sabha Mallikarjun Kharge speaks on Congress MP DK Suresh's "…forced to demand a separate country" statement.
"…If anyone speaks about breaking the country, we will never tolerate it – irrespective of whichever party they belong to.… pic.twitter.com/LuR3cNjXaT
— ANI (@ANI) February 2, 2024
ఎంపీ డీకే సురేశ్ చేసిన ప్రత్యేక దేశం వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఖండించారు. ‘దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా మాట్లాడే వారెవరైనా.. ఏ పార్టీకి చెందిన వారైనా సరే.. సహించేదీ లేదన్నారు మల్లికార్జున్ ఖర్గే. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు మనం ఒక్కటేనని, మనం ఒక్కటిగానే ఉంటామని స్పష్టం చేశారు. డికె సురేష్ ప్రత్యేక దేశం డిమాండ్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం రాజ్యసభలో ప్రకటన చేశారు.
డీకే సురేశ్ వ్యాఖ్యలపై భారతీ జనతా పార్టీ ఎంపీలు తీవ్రస్థాయిలో అభ్యంతరం చెప్పారు. కాంగ్రెస్ నాయకులు క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. DK సురేష్ భారత రాజ్యాంగంపై దాడి అని, దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను అవమానించేలా మాట్లాడారని, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. తమ పార్టీ ఎంపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని లోక్‌సభ ఎథిక్స్ కమిటీకి సూచించాలని డిమాండ్ చేశారు జోషి.
మరోవైపు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యతో మాటల యుద్ధానికి దిగిన డీకే సురేష్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఈమేరకు తన X హ్యాండిల్‌లో సమాధానం ఇచ్చారు. “రాష్ట్రకవి కువెంపు, మన నాద గీతంలో, ‘జయ భారత జననీయ తనుజాతే, జయ హే కర్ణాటక మాథే’ అని పోస్ట్ చేశారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తూ, “కాంగ్రెస్ పార్టీకి ‘విభజించు – పాలించు’ చరిత్ర ఉందని ఆరోపించారు. దాని ఎంపీ డీకే సురేష్ ఇప్పుడు ఉత్తర – దక్షిణాదిని విభజించాలని కోరుతూ మళ్లీ ట్రిక్ ప్లే చేస్తున్నారు” అని బిజెపి ఎంపి విమర్శించారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి కంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో పన్నుల విభజన చాలా ఎక్కువైందని ఆయన అన్నారు. “2009-14 నుండి UPA-2 సమయంలో కర్ణాటకకు పన్నుల పంపిణీ రూ. 53,396 కోట్లుగా ఉండగా, 2014-19లో నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో రూ.1.35 లక్షల కోట్లు దాటింది” అని సూర్య పేర్కొన్నారు.
it is one of the last few states to receive grants.
Karnataka was among the states that lost heavily under the 15th Finance Commission. The 14th Finance Commission gave #Karnataka a share of 4.71% in the divisible pool of taxes. The state's share came down to 3.64%. 3/4
— DK Suresh (@DKSureshINC) February 1, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




