అన్నా డీఎంకేలో పళని, పన్నీర్‌ మధ్య అధిపత్యపోరాటం అర్థాంతరంగా ముగిసిన పార్టీ సర్వసభ్య సమావేశం

అన్నాడీఎంకేలో లుకలుకలు మొదలయ్యాయి.. ఇవాళ జరిగిన అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ విషయం స్పష్టమయ్యింది.. సమావేశంలో ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం మధ్య తీవ్ర వాగ్వాదం..

అన్నా డీఎంకేలో పళని, పన్నీర్‌ మధ్య అధిపత్యపోరాటం అర్థాంతరంగా ముగిసిన పార్టీ సర్వసభ్య సమావేశం
Follow us
Balu

|

Updated on: Sep 28, 2020 | 5:46 PM

అన్నాడీఎంకేలో లుకలుకలు మొదలయ్యాయి.. ఇవాళ జరిగిన అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ విషయం స్పష్టమయ్యింది.. సమావేశంలో ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలల్లో పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాను ఉండటమే సమంజసం అని పన్నీర్‌సెల్వం పట్టుబట్టారు.. అమ్మ జయలలిత తనను రెండుసార్లు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారని పన్నీర్‌సెల్వం గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం పదవిని పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మొహమాటం కొద్దీ ఒప్పుకున్నానని, ఇకపై అలా కుదరదని తేల్చి చెప్పారు పన్నీర్‌.. శశికళ మేడమ్‌ తనను ముఖ్యమంత్రిగా నిర్ణయించారనీ, రేపొద్దున పార్టీ గెలిస్తే తానే ముఖ్యమంత్రి అవుతానని పళనిస్వామి కౌంటర్‌ ఇచ్చారు. పైగా ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని గట్టిగా చెప్పారు. ఇద్దరిలో ఎవరికి మద్దతు ఇవ్వాలన్నదానిపై క్యాడర్‌లో అయోమయం నెలకొంది.. సగం మంది పన్నీర్‌ సెల్వంకు జై కొట్టారు.. ఇంకో సగం పళనిస్వామి వెంట నెలిచారు.. సమావేశంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది.. అరుపులు కేకలతో తీవ్ర గందరగోళం నెలకొంది.. దాంతో ముఖ్యమంత్రి అభ్యర్థి, పార్టీ చీఫ్‌ ఎవరన్న నిర్ణయం వాయిదా పడింది.. ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండానే సర్వసభ్య సమావేశం అర్ధంతరంగా ముగిసింది..