దాల్ సరస్సు సమీపంలో టాయ్‌లెట్ కేఫ్‌లు
జమ్మూ కశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసిన తరువాత తొలి తెలంగాణ స్టార్టప్ కంపెనీ జమ్మూలో అడుగు పెట్టింది.
జమ్మూ కశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసిన తరువాత తొలి తెలంగాణ స్టార్టప్ కంపెనీ జమ్మూలో అడుగు పెట్టింది. ప్రధాన నగరాల్లోని లూ కేఫ్ పబ్లిక్ వాష్‌రూమ్ కాన్సెప్ట్ ను ఇప్పుడు శ్రీనగర్ లోని సుందరమైన దాల్ సరస్సు పర్యాటకులకు పరిచయం చేస్తోంది. మొదటి పబ్లిక్ వాష్‌రూమ్ ను గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. జమ్మూ కశ్మీర్ లో తెలంగాణ నుండి ఇదే మొదటి స్టార్టప్ కంపెనీ కావడం విశేషం. జమ్మూ కాశ్మీర్‌లో మొత్తం 21 ఉచిత పబ్లిక్ వాష్‌రూమ్‌లను నిర్మిస్తేందుకు సంస్థ సన్నద్ధమవుతోంది.
‘లూ కేఫ్’ నగర పౌరుల కోసం వెలసిన లగ్జరీ వాష్‌రూమ్. హైదరాబాద్ హైటెక్ సిటీలో మొట్టమొదటి లూకేఫ్ గత ఏడాది మార్చి నెలలోనే వెలిసింది. ఇదే తరహాలో జమ్మూ కశ్మీర్ లో ఏర్పాటు చేస్తున్నారు లూ కేఫ్ సంస్థ నిర్వహకులు. ఇందులో పచ్చని చెట్లు, చిన్న చిన్న మొక్కల మధ్యన ఉండే ఈ కేఫ్‌లో పరిశుభ్రమైన మరుగుదొడ్లతోపాటు వైఫై ఇంటర్నెట్ సౌకర్యం, ఏటీఎం, చిన్నసైజ్ బేకరీ ఫుడ్ స్టాల్‌తో లూ కేఫ్ వాష్‌రూమ్‌లను సుందరంగా తీర్చిదిద్దారు. వాష్ రూమ్‌లో కూలర్లను ఏర్పాటు చేయడమే కాకుండా ఆడవాళ్ల కోసం చౌకగా అంటే, ఐదు రూపాయలకు మించకుండా శానిటరీ నాప్‌కిన్స్‌ను అందిస్తున్నారు.
అయితే, యూజర్ చార్జీలను వసూలు చేయకుండా వాష్‌రూమ్‌ను పరిశుభ్రంగా నిర్వహించాలంటే అందుకు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును రాబట్టేందుకే కేఫ్, ఏటిఎంలు. ఏటీఎంకు స్థలం ఇచ్చినందుకు దానికి సంబంధిచిన బ్యాంక్ నెలకింత అద్దె చెల్లిస్తుంది. ఇక కేఫ్‌ను నడుపుకునేవారు కూడా అద్దె చెల్లిస్తారు. దీంతో వాష్‌రూమ్‌లను శుభ్రంగా ఎప్పటికప్పుడు వాష్ చేయవచ్చని నిర్వహకులు తెలిపారు.
ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో తెలంగాణ లూ కేఫ్ దీనిని జమ్మూ కశ్మీర్ అధికారులు ఒప్పందం కుదర్చుకున్నారు. ఈ సందర్భంగా లూకేఫ్ సంస్థ ఇచ్చి ప్రదర్శన ఆకట్టుకున్న తరువాత స్టార్టప్ శ్రీనగర్ వైపు వెళ్ళింది. మొత్తం మీద మూడు దాల్ సరస్సు చుట్టూ ఏర్పాటు చేస్తున్నారు. స్థానికుల అవసరాలకు అనుగుణంగా వాష్‌రూమ్‌లను నిర్మించింది. ‘వాజు’ కోసం ఒక ప్రాంతం కూడా నిర్మించారు. వాష్‌రూమ్‌ల లోపల మౌలిక సదుపాయాల దిశలు స్థానిక ప్రాధాన్యతల ప్రకారం ఉండేలా చూసుకున్నారు.
మొదటి వాష్‌రూమ్ దాల్ సరస్సు సమీపంలో మొఘల్ తోట నిషాత్ బాగ్ వద్ద ప్రారంభించాలని లూకేఫ్ నిర్ణయించింది. జమ్మూ కాశ్మీర్ మాజీ లెఫ్టెనెంట్ గవర్నర్ ప్రస్తుత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గిరీష్ చంద్ర ముర్ము ప్రోత్సహంతో వీటిని ఏర్పాట్లు చేసినట్లు లూ కేఫ్ వ్యవస్థాపకుడు అభిషేక్ నాథ్ అన్నారు. వాష్‌రూమ్‌ల కొరతను అధిగమిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇలాంటి ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇవీ కార్మికులకు, పర్యాటకులకు, ముఖ్యంగా పేదలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.