ఒక్క రూపాయికే బైక్‌ బుక్ చేసుకునే అవకాశం.. వివరాలివే

బైక్‌ని కొనేందుకు తగినంత డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న వారికి ఫెడరల్ బ్యాంక్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఒక్క రూపాయితో బైక్‌ని బుక్‌ చేసుకునే అవకాశం

ఒక్క రూపాయికే బైక్‌ బుక్ చేసుకునే అవకాశం.. వివరాలివే
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 28, 2020 | 5:07 PM

Bike booking at rs.1: బైక్‌ని కొనేందుకు తగినంత డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న వారికి ఫెడరల్ బ్యాంక్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఒక్క రూపాయితో బైక్‌ని బుక్‌ చేసుకునే అవకాశం ఆ బ్యాంక్ కస్టమర్లకు బంపరాఫర్ ఇచ్చింది. కస్టమర్లు ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డు ద్వారా ఒక్క రూపాయిని చెల్లించి బైక్‌ బుక్ చేసుకోవచ్చునని తెలిపింది. ఇక మిగిలిన సొమ్మును ఈఎంఐల ద్వారా చెల్లించవచ్చని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఎంపిక చేసిన హీరో హోండా, టీవీఎస్ షోరూంలలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అంతేకాదు ఎంపిక చేసిన హోండా షోరూంలో బైక్‌ కొనుగోలు చేసిన వారికి 5 శాతం క్యాష్‌ బ్యాక్ ఇస్తున్నట్లు తెలిపింది.

కాగా ఈఎంఐ అర్హతను తెలుసుకోవడానికి ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు ‘DC-SPACE-EMI’ అని టైప్ చేసి 5676762 నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయచ్చు. లేకపోతే 7812900900 నంబరుకు మిస్డ్‌కాల్ ఇచ్చి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే 500సీసీ ఇంజన్ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న బైక్‌లపై 17 శాతం వడ్డీ రేటు అందిస్తున్నట్లు బ్యాంకు వివరించింది. రానున్న పండగ సీజన్‌, ద్విచక్రవాహనాల కొనుగోళ్లపై జీఎస్టీ తగ్గిన నేపథ్యంలో ఈజీ ఫైనాన్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్ల ద్వారా కస్టమర్లకు ప్రోత్సాహాలను ఇవ్వాలని భావించినట్లు బ్యాంకు వెల్లడించింది.

Read More:

బన్నీకి విలన్‌గా కోలీవుడ్ స్టైలిష్‌ హీరో..!

Sushant Case: ఆ నలుగురు హీరోయిన్లు అదే చెప్పారు: ఎన్సీబీ