బన్నీకి విలన్‌గా కోలీవుడ్ స్టైలిష్‌ హీరో..!

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ పుష్పలో నటించనున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్‌కి బ్రేక్‌ పడగా

బన్నీకి విలన్‌గా కోలీవుడ్ స్టైలిష్‌ హీరో..!
Follow us

| Edited By:

Updated on: Sep 28, 2020 | 4:40 PM

Allu Arjun Pushpa: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ పుష్పలో నటించనున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్‌కి బ్రేక్‌ పడగా.. త్వరలో షూటింగ్‌ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు సుకుమార్. ఇందుకోసం హైదరాబాద్‌లో ప్రత్యేక సెట్‌ని వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇందులో విలన్‌గా కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతిని అనుకున్నారు. కానీ డేట్లు క్లాష్‌ అవుతుండటంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ఆయన ఓ సందర్భంలో తెలిపారు. ఈ క్రమంలో ఆ పాత్రలో బాబీ, సునీల్ శెట్టి ఇలా పలువురి పేర్లు వినిపించాయి. అయితే వారెవరు కన్ఫర్మ్ కాలేదు.

ఇక తాజాగా విలన్ పాత్రకు గానూ మరో పేరు ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తోంది. కోలీవుడ్ స్టైలిష్‌ స్టార్ మాధవన్‌ని విలన్‌ పాత్ర కోసం సంప్రదించడం, ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయని సమాచారం. అంతేకాదు త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. అయితే సవ్యసాచి ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మాధవన్‌.. అనుష్క నిశ్శబ్దంలో నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 2న ఓటీటీలో విడుదల కానుంది.

కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో నటించనున్నారు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో జగపతి బాబు, ప్రకాష్‌ రాష్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Read More:

Sushant Case: ఆ నలుగురు హీరోయిన్లు అదే చెప్పారు: ఎన్సీబీ

పవన్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌ చెప్పిన బండ్ల గణేష్‌

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..