భారత్-చైనా మధ్య మళ్ళీ చర్చలు.. ఫలించేనా ?

భారత్-చైనా మధ్య మళ్ళీ చర్చలు ప్రారంభమయ్యాయి. నిన్న జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిసిన సంగతి తెలిసిందే. గురువారం మేజర్ జనరల్ స్థాయి చర్చలు జరుగుతున్నాయి. సోమవారం గాల్వన్ వ్యాలీలో..

  • Umakanth Rao
  • Publish Date - 1:10 pm, Thu, 18 June 20
భారత్-చైనా మధ్య మళ్ళీ చర్చలు.. ఫలించేనా ?

భారత్-చైనా మధ్య మళ్ళీ చర్చలు ప్రారంభమయ్యాయి. నిన్న జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిసిన సంగతి తెలిసిందే. గురువారం మేజర్ జనరల్ స్థాయి చర్చలు జరుగుతున్నాయి. సోమవారం గాల్వన్ వ్యాలీలో ఉభయ దేశాల దళాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించగా,, చైనా సైన్యంలో సుమారు 45 మంది గాయపడడమో, మరణించడమో జరిగిందని భారత ఆర్మీ పేర్కొంది. అయితే తమ వైపున 30 మంది సైనికులు మరణించినట్టు చైనా అంగీకరించింది. కాగా ఇండియా తన త్రివిధ దళాలను సన్నధ్ధంగా ఉంచింది. భారత వైమానిక దళం కొంత ముందు స్థావరాల వైపు వెళ్లగా,, నేవీ హిందూ మహాసముద్రంలో సన్నద్ధంగా ఉంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని, దీటైన సమాధానం ఇస్తామని ప్రధాని మోదీ నిన్న ప్రకటించడంతో భారత సైన్యం కూడా పూర్తి అప్రమత్తమైంది. గాల్వాన్ లోయలో పరిస్థితి మాత్రం నివురు గప్పిన నిప్పులా ఉంది. చైనా దళాలు తమ స్థావరాల నుంచి వెనక్కి కదల లేదు.