ప్రముఖ ఏరోస్పేస్ శాస్త్రవేత్త కన్నుమూత.. మెదడులో రక్తస్రావం కావడంతో నరసింహ మృతి..

ప్రముఖ ఏరోస్పేస్ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, ప్రొఫెసర్ రొద్దం నరసింహా కన్నుమూశారు. మెదడులో రక్తస్రావం కావడంతో బెంగుళూరులోని ఎంఎస్ ఆసుపత్రిలో ఆయన రాత్రి మృతి చెందారు.

ప్రముఖ ఏరోస్పేస్ శాస్త్రవేత్త కన్నుమూత.. మెదడులో రక్తస్రావం కావడంతో నరసింహ మృతి..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 15, 2020 | 2:56 PM

ప్రముఖ ఏరోస్పేస్ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, ప్రొఫెసర్ రొద్దం నరసింహా కన్నుమూశారు. మెదడులో రక్తస్రావం కావడంతో బెంగుళూరులోని ఎంఎస్ ఆసుపత్రిలో ఆయన రాత్రి మృతి చెందారు. డిసెంబర్ 8న రొద్దం చేరారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. బెంగుళూరులోని ఐఐఎస్సీ, జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‏డ్ రీసెర్చ్‏లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. కాగా రొద్దం చనిపోయే వరకు కూడా చాలా ఉత్సాహంగానే విధులు నిర్వహించారు.

1955లో రొద్దం నరసింహ ఎంఈ పూర్తిచేసిన అనంతరం 1957లో ఐఐఎస్సీలో ఎంఎస్సీ పూర్తిచేశారు. ఆ తర్వాత కాలిఫోర్నియా ఇన్‏స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో హీహెచ్‏డీ పట్టా పొందారు. తర్వాత భారత్‏లోని ఏరోస్పేస్, అట్మాస్ఫరిక్ ఫ్లూయిడ్ డైనమిక్స్‏లో పరిశోధనలు నిర్వహించారు. అంతేకాక ఇస్రో, తేలికపాటి యుద్ధవిమానాలు, ప్రధాన శాస్త్రీయ కార్యక్రమాల్లో కూడా ఈయన పనిచేశారు. నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ డైరెక్టర్‏గా కూడా పనిచేశారు రొద్దం నరసింహ. అంతేకాకుండా సతీష్ దావన్ మొదటి విద్యార్థి కూడా ఈయనే. 1978లో భట్నాగర్ అవార్డు, 2013లో భారత అత్యున్నత రెండో పౌర పురుస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు. అలాగే భారత మాజీ రాష్ట్రపతి, దివంగత డాక్టర్ అబ్దుల్ కలాంతో కలిసి ‘డెవలప్‏మెంట్స్ ఇన్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ’ అనే పుస్తకాన్ని కూడా రచించారు.