AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Row: పార్లమెంట్ నుంచి ఈడీ కార్యాలయానికి ప్రతిపక్ష ఎంపీల ప్రదర్శన.. మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు

Parliament Adani Row: అదానీ అంశంపై చర్చ జరపాల్సిందేనంటూ ప్రతిపక్ష పార్టీలు పట్టు పడుతున్నాయి. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

Adani Row: పార్లమెంట్ నుంచి ఈడీ కార్యాలయానికి ప్రతిపక్ష ఎంపీల ప్రదర్శన.. మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు
All Parties
Balaraju Goud
|

Updated on: Mar 15, 2023 | 3:09 PM

Share

అదానీ అంశం మరోసారి పార్లమెంట్‌ను కుదేపేసింది. రెండో విడత సమావేశాలు మొదలైనప్పటి నుంచి రాజకీయాలు మరింత వేడెక్కాయి. అదానీ అంశంపై చర్చ జరపాల్సిందేనంటూ ప్రతిపక్ష పార్టీలు పట్టు పడుతున్నాయి. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీన్ని కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోడం లేదు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని మండిపడుతున్నారు విపక్షనేతలు ఆందోళన బాట పట్టారు.

ఈ క్రమంలోనే పార్లమెంట్‌ నుంచి 16 ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలందరూ ఈడీ కార్యాలయం వరకూ నిరసన ర్యాలీ చేపట్టారు. అదానీ అంశంపై విచారణ జరపాలని మెమొరాండం సమర్పించేందుకు బయలుదేరారు. పాదయాత్ర చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు. 200 మంది ఎంపీలను నిలువరించేందుకు 2000 మంది పోలీసులను మోహరించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఫలితంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పోలీసులు బారికేడ్లు పెట్టి ప్రతిపక్ష నేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సెక్షన్ 144 అమల్లో ఉందని, ఎంపీలెవరూ ర్యాలీ చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఇక్కడ ఆందోళనలు చేపట్టడం కుదరదంటూ ప్రకటనలు చేస్తున్నారు. ప్రతిపక్ష ఎంపీలు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ర్యాలీ కొనసాగించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే ఈ ప్రదర్శనలో ఎన్‌సీపీ సహా తృణమూల్‌ నేతలు పాల్గొన లేదు. ఈరోజు విపక్షాల ఎంపీలు సభ నుంచి ఈడీ కార్యాలయం వరకు మార్చ్‌ నిర్వహించి అదానీ స్కాంపై గళం విప్పారని కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది.

అయితే చివరికి ఢిల్లీ పోలీసులు ఆ తర్వాత ప్రతిపక్ష నేతల బృందాన్ని మాత్రమే వెళ్లేందుకు అనుమతించగా మిగిలిన ఎంపీలు వెను తిరిగి వెళ్లారు. విపక్ష ఎంపీల నిరసనను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కార్యాలయం వెలుపల భద్రతను పెంచారు.

అదానీ గ్రూప్‌ కుంభకోణం కేసులో మెమోరాండం సమర్పించేందుకు ఈడీ డైరెక్టర్‌ను కలవబోతున్నామని, అయితే ప్రభుత్వం మమ్మల్ని అడ్డుకుంది, విజయ్‌చౌక్‌ వరకు వెళ్లేందుకు కూడా అనుమతించలేదని ఖర్గే మండిపడ్డారు. అదే సమయంలో, రాష్ట్రీయ జనతాదళ్ ఎంపీ మనోజ్ ఝా ప్రభుత్వం నియంతృత్వ ప్రభుత్వమని, ప్రతిపక్షాల గొంతును అణచివేయాలని ఆరోపించారు. నిరసన సందర్భంగా, కాంగ్రెస్‌తో సహా పలు ప్రతిపక్ష పార్టీలు అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా మూడు పేజీల మెమోరాండం సిద్ధం చేశాయి. అందులో షెల్ కంపెనీలతో సహా అనేక ఆరోపణలు వచ్చాయి.

అయితే, దేశీయ వంటగ్యాస్ ధరల పెంపుపై పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేయడంతో ప్రతిపక్ష పార్టీల ఈ మార్చ్‌లో తృణమూల్ కాంగ్రెస్ భాగం కాలేదు.

అమెరికా ఫైనాన్షియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వెలువడినప్పటి నుంచి అదానీ గ్రూప్‌పైనా, ప్రధాని నరేంద్ర మోదీపైనా విరుచుకుపడుతున్న ప్రతిపక్ష పార్టీల సభ్యులు సంయుక్త పార్లమెంటరీ కమిటీని వేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అమెరికన్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన నివేదికలో అదానీ గ్రూప్‌పై మోసపూరిత లావాదేవీలు, షేర్ల ధరల తారుమారుతో సహా అనేక తీవ్రమైన ఆరోపణలు చేసింది కాంగ్రెస్. అయితే, అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను తప్పు అని పేర్కొంది. కంపెనీ అన్ని చట్టాలు, నిబంధనలను అనుసరిస్తుందని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..