Trisha: సోషల్ మీడియాను చుట్టేస్తున్న త్రిష పొలిటికల్ ఎంట్రీ.. క్లారిటీ.. ఏ రాష్ట్రం నుంచంటే..

పొలిటికల్‌ ఎంట్రీపై నటి త్రిష స్పందించారు. కాంగ్రెస్‌లో చేరతారని జోరుగా జరుగుతున్న ప్రచారంపై మాట్లాడారు. ప్రస్తుతానికి నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని..

Trisha: సోషల్ మీడియాను చుట్టేస్తున్న త్రిష పొలిటికల్ ఎంట్రీ.. క్లారిటీ.. ఏ రాష్ట్రం నుంచంటే..
Actress Trisha

Updated on: Dec 26, 2022 | 9:14 AM

రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆసక్తి తనకు లేదన్నారు సినీ నటి త్రిష. పదవుల కోసం రాజకీయాల్లోకి వెళ్ల కూడదన్నారు. జీవితాన్ని పూర్తిగా ప్రజాసేవకి అంకితం చేయగలిగితేనే రాజకీయాల్లోకి వెళ్లాలని త్రిష అభిప్రాయపడ్డారు. తనకు అంత ఓపిక, ధైర్యం లేవన్నారు. ఈ సందర్భంలో త్రిష సహా చిత్రబృందం ‘రంగీ’ ప్రమోషన్ వర్క్ కోసం ప్రెస్ మీట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో త్రిష మాట్లాడుతూ.. నేను తెరపై 20 ఏళ్లుగా ఉన్నాను. ఎప్పుడూ పాజిటివ్ కామెంట్స్ మాత్రమే తీసుకుంటానని.. ఎలాంటి నెగెటివ్ కామెంట్స్ గురించి పట్టించుకోను. కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం మొదలైంది. ఆ సమాచారం ఒక్క శాతం కూడా నిజం కాదు. రాజకీయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. న‌న్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు.. నీ అభిమాన న‌టుడు ఎవ‌రు వంటి ప్ర‌శ్న‌ల‌కు దూరంగా ఉండ‌డం మంచిద‌ని బదులిచ్చారు.

ఎంజియుమ్ అమైత్, ఇవాన్ అహే మఖిల్, వలియవన్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎం.శరవణన్ ఆ తర్వాత త్రిష నటించిన `రాంకీ`కి దర్శకత్వం వహించారు. సినిమాలో పలు వివాదాస్పద సన్నివేశాలు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెన్సార్ బోర్డు అనుమతి నిరాకరించింది.

ఆ తర్వాత అప్పీల్‌పై సెన్సార్ బోర్డు సినిమాలోని 30 సీన్లను తొలగిస్తూ ‘యూఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం ‘రంగీ’ సినిమా ట్రైలర్ విడుదలై వైరల్‌గా మారింది. డిసెంబర్ 30న సినిమా థియేటర్లలోకి రానుంది.

ఇవి కూడా చదవండి

అయితే గతంలో కూడా రాజకీయాల్లోకి వస్తారా అంటూ అభిమానులు ప్రశ్నించారు. అయితే  చెన్నై లయోలా కళాశాల ఆవరణలో జరిగిన యునిసెఫ్‌ కార్యక్రమంలో ఆమె పాల్గొన్న సందర్భంగా కూడా ఇదే విషయాలన్ని వెల్లడించారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు ఇంకా పటిష్టమైన చట్టాలు అవసరమని త్రిష అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం