Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mary Kom – K Onkholer: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన లేడీ బాక్సర్ మేరీకోమ్ భర్త ఓంఖోలర్

భారత బాక్సింగ్ దిగ్గజం, రాజ్యసభ ఎంపీ మేరీకోమ్ భర్త కె ఓంఖోలర్ రాబోయే మణిపూర్ సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.

Mary Kom - K Onkholer: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన లేడీ బాక్సర్ మేరీకోమ్ భర్త ఓంఖోలర్
Mary Kom's Husband
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 03, 2021 | 7:23 AM

Boxer Mary Kom’s husband K Onkholer: భారత బాక్సింగ్ దిగ్గజం, రాజ్యసభ ఎంపీ మేరీకోమ్ భర్త కె ఓంఖోలర్ రాబోయే మణిపూర్ సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. 2022లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో చురచంద్‌పూర్ జిల్లాలోని 59 సైకోట్ (ST) అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారు. చురచంద్‌పూర్ జిల్లాలోని సైకోట్ ఏసీకి చెందిన తన స్వగ్రామమైన సములంలాన్‌లో శనివారం జరిగిన అభ్యర్థిని ఆశీర్వదించే కార్యక్రమంలో కె ఓంఖోలర్ ఈ ప్రకటన చేశారు.

ఆశీర్వాదం కార్యక్రమంలో సైకోట్ నియోజకవర్గంలోని వివిధ చర్చి నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, మహిళలు, యువజన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కె ఓంఖోలర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి BJP టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే TN హౌకిప్‌పై పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే, ప్రస్తుతానికి, తాను ఏ నిర్దిష్ట రాజకీయ పార్టీలో చేరడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అయితే బిజెపి నుండి టికెట్ పొందడంలో విఫలమైతే, ఇండిపెండెంట్‌గా బిజెపి టిక్కెట్‌పై ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఒంఖోలేర్ మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నియోజకవర్గం అభివృద్ధిలో అనేక అవాంతరాలను ఎదుర్కొంటోందని, అంకిత భావంతో నిబద్ధతతో ప్రజాసేవ చేయాలన్నారు. సిట్టింగ్ రాజ్యసభ ఎంపీ అయిన తన సతీమణి మేరీకోమ్‌తో తగు సంప్రదింపుల తర్వాతే తాను ఎన్నికల రాజకీయాల్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన వివిధ హింసాకాండ గురించి ఓంఖోలర్ మాట్లాడుతూ, “ఎన్నికలు పోరాటం గురించి కాదు, ఇది కేవలం పోటీ మాత్రమే. మనం ఎలాంటి హింసాత్మక చర్యలకు దూరంగా ఉండి శాంతికి కట్టుబడి ఉందాం.” అని అయన పిలుపునిచ్చారు. వివిధ చర్చిల నుంచి వచ్చిన పాస్టర్లు ఓంఖోలర్‌కు ఆశీర్వాద ప్రార్థనలు చేసి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఇదిలావుంటే, కొండ ప్రాంతం అయిన మణిపుర్ రాష్ర్టంలో పుట్టి… కండలు పెంచిన మహిళగా మేరికోమ్ ప్రపంచ గుర్తింపు పొందింది. ఒలంపిక్స్ లో పతకం సాధించటంతో అందరి దృష్ఠి ఆమెపై పడింది. మేరి కోమ్ జీవితం తెలుసుకున్నవారంతా.. ఒక పేద మహిళ ప్రపంచ క్రీడల్లో ప్రతిభ కనబర్చడంపట్ల దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లవెత్తాయి. కేవలం కుటుంబ పోషణ కోసం క్రీడల్లోకి ప్రవేశించింది. కట్టుబాట్లు, సాంప్రదాయాలతో పాటు, వెనకబాటుతనం ఉండే మణిపుర్ రాష్ర్టంలో ఒక మహిళ క్రీడల్లోకి వచ్చి అది కండ బలం కావాల్సిన బాక్సింగ్ లోకి వచ్చి సంచలనమే రేపింది. అనంతరం ఆటలకు స్వస్తి పలకడంతో రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ్యకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాజాగా ఆమె భర్త కె ఓంఖోలర్ కూడా రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు.

31ఏళ్ళ మేరికోమ్ ప్రారంభంలో అన్ని ఆటలు ఆడింది. ఇలా వివిధ క్రీడల్లో పలు పతకాలు కూడా సాధించింది. ఆ తర్వాత క్రమంగా బాక్సింగ్ వైపు దృష్టి మరలి శిక్షణ తీసుకుంది. ఇలా 2000 సంవత్సరంలో మణిపుర్ రాష్ర్టంలో మహిళా బాక్సింగ్ పోటిల్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఈస్ట్ ఇండియా పోటిల్లో కూడా విజయం సాధించింది. ఆ తర్వాత 2005 వరకు అనేక పోటిల్లో పాల్గొని పతకాలను గెలుచుకుంది. ఆమె ప్రతిభను పేపర్లో వచ్చిన ఫొటోను చూసి తల్లితండ్రులు తెలుసుకున్నారు. అప్పటివరకు వారికి మేరి కోమ్ బాక్సింగ్ చాంపియన్ అనే విషయమే తెలియదు.

మేరికోమ్ జీవితంలో అంతా విజయాలు, సక్సెస్ బాటలే అనుకుంటే పొరపాటే. నాణెంకు ఒక వైపు ఆమె చాంపియన్ అయితే అవతలి వైపు సాధారణ మహిళ. మొదట్లో కుటుంబ ఆర్ధిక పరిస్థితులు అంతగా అనుకూలించలేదు. దీనికితోడు అసోసియేషన్ లో రాజకీయాలు. వివాదాలు, వివక్షలు ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంది. ఇక పెళ్లి, పిల్లల కారణంగా కొంతకాలం బాక్సింగ్ కు దూరంగా ఉంది. భర్త సహకారంతో మళ్లీ శిక్షణ మొదలెపెట్టింది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా.., ఎంచుకున్న లక్ష్యం కోసం ముందుకు కదిలింది.

Read Also…  T20 World Cup 2021: ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‎లో ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలి.. సునీల్ గవాస్కర్ సూచన..