Accidents: ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాల్లో ఏటా 30 వేల మంది ప్రాణాలు కాపాడవచ్చు.. ఇంటర్నేషన్‌ జర్నల్‌ నివేదికలో వెల్లడి.

Accidents: రోడ్డు భద్రతా ఎంత ముఖ్యమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోడ్డు నిబంధనలను గాలికి వదిలడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడం వల్ల ఏటా ఎంతో మంది ప్రాణాలు వదులుతున్నారు. సహజ మరణాలతో పోలిస్తే, ప్రమాదాల్లో...

Accidents: ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాల్లో ఏటా 30 వేల మంది ప్రాణాలు కాపాడవచ్చు.. ఇంటర్నేషన్‌ జర్నల్‌ నివేదికలో వెల్లడి.
Road Accidents
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 01, 2022 | 6:50 AM

Accidents: రోడ్డు భద్రతా ఎంత ముఖ్యమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోడ్డు నిబంధనలను గాలికి వదిలడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడం వల్ల ఏటా ఎంతో మంది ప్రాణాలు వదులుతున్నారు. సహజ మరణాలతో పోలిస్తే, ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్యే ఎక్కువని చేదు నిజం కలవరపెడుతోంది. అయితే కొన్ని రకాల చర్యలతో పెద్ద ఎత్తున ప్రాణాలు కాపాడుకోవచ్చని ఓ అంతర్జాతీయ జర్నల్‌ తన నివేదికలో పేర్కొంది. రోడ్డు భద్రతా చర్యలను మరింత మెరుగుపరచడం వల్ల భారత్‌లో ఏటా సుమారు 30 వేల మందిని కాపాడవచ్చని ప్రముఖ ఇంటర్నేషన్‌ జర్నల్‌ ది లాన్సెట్‌ తన నివేదికలో తెలిపింది.

ఈ జర్నల్‌లో ప్రచురించిన అంశాల ప్రకారం.. ఒక్క అతివేగాన్ని అరికట్టడం ద్వారానే ఏటా 20,554 మంది ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపింది. హెల్మెట్‌లను తప్పనిసరి చేయడం ద్వారా 5,683 మంది, సీటు బెల్టు ఉపయోగించడం వల్ల 3,204 మంది ప్రాణాలను ఏటా రక్షించుకోవచ్చని నివేదిక తెలిపింది. అయితే ప్రమాదాలకు డ్రంక్‌ డ్రైవ్‌ కూడా కారణమైనప్పటికీ ఈ నివేదిక రూపొందించే నాటికి భారత్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌కి సంబంధించిన సమాచారం తమ వద్ద లేదని లాన్సెట్ తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా..

రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏకంగా 1.35 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అధ్యయనంలో తేలింది. వీటిలో దాదాపు 90 శాతానికి పైగా మరణాలు అల్ప, మధ్య ఆదాయ దేశాల్లోనే సంభవిస్తున్నట్లు తేలింది. పైన తెలిపిన రోడ్డు భద్రతా నిబంధనలను పాటించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 3.47 లక్షల నుంచి 5.4 లక్షల మంది ప్రాణాలను కాపాడొచ్చు. ఈ కారణంగానే రోడ్డు భద్రతపై దేశాలన్నీ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..