Uniform Civil Code: ఉమ్మడి పౌరస్మృతి అమలుకు మద్ధతిస్తూ.. ఒక షరతు పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ
ఉమ్మడి పౌరస్మృతి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటీవల ప్రధాని మోదీ వేరువేరు చట్టాలతో దేశ ప్రజల్ని ఎలా నడపాలంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై రాజకీయ పార్టీలు భిన్నంగా స్పందిస్తున్నాయి. ఈ క్రమంలో యూనిఫాం సివిల్ కోడ్‌కు తాజాగా ఆమ్ఆద్మీ పార్టీ తన మద్దతు తెలిపింది. అయితే ఓ షరతు కూడా పెట్టింది.

ఉమ్మడి పౌరస్మృతి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటీవల ప్రధాని మోదీ వేరువేరు చట్టాలతో దేశ ప్రజల్ని ఎలా నడపాలంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై రాజకీయ పార్టీలు భిన్నంగా స్పందిస్తున్నాయి. ఈ క్రమంలో యూనిఫాం సివిల్ కోడ్‌కు తాజాగా ఆమ్ఆద్మీ పార్టీ తన మద్దతు తెలిపింది. అయితే ఓ షరతు కూడా పెట్టింది. అదేంటంటే ఈ బిల్లు ప్రవేశపెట్టేముందు అన్ని పక్షాలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన తర్వాత అప్పుడు కేంద్రం ఏకాభిప్రాయానికి రావాలని పేర్కొంది.
ఆర్టికల్ 44 కూడా ఇదే అంశాన్ని తెలియజేస్తుందని. ఇటువంటి విషయాలపై ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుందని నమ్ముతున్నామని చెప్పుకొచ్చింది. రాజకీయ పార్టీలు, అలాగే రాజకీయేతర సంస్థలతో కూడా కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని.. ఆ తర్వాతే యునిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేయాలని.. ఆమ్ఆద్మీ పార్టీ జనరల్ సెక్రటరీ సందీప్ పాఠక్ తెలిపారు.
ఇదిలా ఉండగా యూనిఫాం సివిల్ కోడ్‌కు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు ప్రజల్ని రెచ్చగొడుతున్నాయని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. వేరు వేరు చట్టాలతో దేశాన్ని ఎలా నడపాలని.. ఒకే కుటుంబంలో వేర్వేరు చట్టాలు అమలు చేయడం సాధ్యమేనా అంటూ ప్రశ్నించారు. పలు ఇస్లామిక్ దేశాల్లో కూడా ఈ చట్టాన్ని నిషేధించారని తెలిపారు. రాజ్యాంగం సైతం ప్రజలకు సమాన హక్కుల గురించి చెబుతోందని పేర్కొన్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం