AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గొర్రె పిల్ల ధర కోటీ రూపాయలు.. అయినా విక్రయించనంటున్న యజమాని.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

మామూలుగా మేకలు, గొర్రెల ధరలు వేలల్లోనే ఉంటాయి. మేలిమి లాంటి జాతుల వాటికి.. ఇంకా వాటికి ఏమైన ప్రత్యేకతలు ఉంటే లక్షల్లో ధరలు ఉండే అవకాశం ఉంటుంది. మరి రూ.కోటీ రూపాయల ధర పలికే గొర్రె పిల్లను ఎప్పుడైన చూశారా? ఒక గొర్రెపిల్లకు కోటీ రూపాయలు ధర ఉండటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా ? మీరు అనుకుంటుంది నిజమే.

గొర్రె పిల్ల ధర కోటీ రూపాయలు.. అయినా విక్రయించనంటున్న యజమాని.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
Shepherd
Aravind B
|

Updated on: Jun 29, 2023 | 5:45 AM

Share

మామూలుగా మేకలు, గొర్రెల ధరలు వేలల్లోనే ఉంటాయి. మేలిమి లాంటి జాతుల వాటికి.. ఇంకా వాటికి ఏమైన ప్రత్యేకతలు ఉంటే లక్షల్లో ధరలు ఉండే అవకాశం ఉంటుంది. మరి రూ.కోటీ రూపాయల ధర పలికే గొర్రె పిల్లను ఎప్పుడైన చూశారా? ఒక గొర్రెపిల్లకు కోటీ రూపాయలు ధర ఉండటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా ? మీరు అనుకుంటుంది నిజమే. రాజస్థాన్‌లోని ఓ గొర్రెపిల్ల రూ.కోటీ ధర పలుకుతోంది. కానీ మరో ఆసక్తికర విషయం ఏంటంటే దానికి అంత భారీగా ధర పలుకుతున్నప్పటికీ ఆ యాజమాని మాత్రం ఆ గొర్రె పిల్లను విక్రయించేందుకు ముందుకు రావడం లేదు. వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్‌లోని చురు జిల్లాకు చెందిన రాజు సింగ్ అనే వ్యక్తి చాలా ఏళ్లుగా గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. అయితే తన గొర్రెల మందలో ఉన్న ఓ గొర్రె పిల్లకు రూ.కోటీ రూపాయలు ఇచ్చి కొనుక్కుంటాం అన్నా అతను దాన్ని అమ్మడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే దాని పొట్ట భాగంలో ఉర్దూ భాషలో 786 ఆకారం ఉంది. అందుకే దాన్ని అమ్మేందుకు నిరాకరిస్తున్నాడు.

గత ఏడాది రాజు సింగ్‌కు ఉన్న మందలో ఈ గొర్రెపిల్ల పుట్టింది. ఇది పెరుగుతున్న క్రమంలోనే దాని పొట్ట భాగంలో ఉర్దూ భాషలో ఏదో ఆకారం రావడాన్ని అతను గమనించాడు. మొదటగా అదేంటో తనకు అర్థం కాలేదు. చివరికి తన గ్రామంలో ఉన్న ముస్లీంలకు దాన్ని చూపించగా.. వారు అది ఉర్దూ భాషలో ఉన్న 786 సంఖ్య అని అది దేవుడి ఆశీర్వాదమని తెలిపారు. అయితే భారత్‌ ఉపఖండంలో ఈ 786 సంఖ్యను ముస్లీంలు పవిత్రంగా భావిస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఆ గొర్రెపిల్లకు ఇలా ఉండటం కొంతమందికి తెలియడంతో దాన్ని కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. దాదాపు రూ.70 లక్షల నుంచి రూ.కోటీ దాకా చెల్లించేందుకు ముందుకు వచ్చారు. కానీ రాజు సింగ్ మాత్రం దాన్ని అమ్మేందుకు ఒప్పుకోవడం లేదు. ఈ గర్రెపిల్ల తనకు ప్రియమైనదని చెప్పాడు. ఇక దానికి 786 సంఖ్య ఉందని తెలిసినప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం