Haryana: నువ్వు చస్తావా.. నేను చావనా.. మద్యం మత్తులో యువకుల ఛాలెంజ్.. సీన్ కట్ చేస్తే..

|

Dec 02, 2022 | 1:53 PM

సాధారణంగా ఎవరైనా పలు విషయాల్లో పందెం వేసుకోవడం మనం చూసే ఉంటాం. డబ్బులో, లేక వస్తువులో పందెం వేస్తుంటారు. అయితే ఈ యువకులు ఎలాంటి పందెం వేసుకున్నారో తెలిస్తే విస్తుపోవాల్సిందే. ఇంతకీ వారేం చేశారో తెలుసా..

Haryana: నువ్వు చస్తావా.. నేను చావనా.. మద్యం మత్తులో యువకుల ఛాలెంజ్.. సీన్ కట్ చేస్తే..
Train Accident
Follow us on

సాధారణంగా ఎవరైనా పలు విషయాల్లో పందెం వేసుకోవడం మనం చూసే ఉంటాం. డబ్బులో, లేక వస్తువులో పందెం వేస్తుంటారు. అయితే ఈ యువకులు ఎలాంటి పందెం వేసుకున్నారో తెలిస్తే విస్తుపోవాల్సిందే. ఇంతకీ వారేం చేశారో తెలుసా.. ఇద్దరిలో ఎవరూ ముందు చనిపోతారోనని పందెం కాచుకున్నారు. కామన్ గా తెలివి ఉన్న వారు ఎవరైనా సరే.. ఇలాంటి పిచ్చి పని చేయరు. కానీ వాళ్లకు మందు దేవుడు పూనడంతో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడాల్సి వచ్చింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. తూగుతూ, తూలుతూ రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లిన ఇద్దరిలో ఒకరు.. మరొకరిని ఎదురుగా వస్తున్న రైలు కిందకు తోసేశాడు. ఈ ఘటనతో అతను అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. అతగాడిని పట్టుకుని మత్తు వదిలించే పనిలో నిమగ్నమయ్యారు. హర్యానాలోని సోనేపట్‌ జట్వారా గ్రామంలో నివాసం ఉండే ముఖేష్, అతని స్నేహితుడు మను ఇద్దరూ దుప్పట్లు అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. బుధవారం వారిద్దరూ పూటుగా మద్యం తాగారు. తర్వాత ముఖేష్ సోదరి ఇంట్లో భోజనం చేశారు.
అనంతరం బయటకు వెళ్లిన తర్వాత ఇద్దరూ ఓ పందెం కాశారు. ఎవరు ముందుగా చనిపోతారనేది ఆ పందెం సారాంశం.

ఈ క్రమంలో రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. రైలు వస్తున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న మను.. పందెం ప్రకారంముఖేష్‌ను రైలు ముందుకు తోసేశాడు. ఊహించని ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మను అక్కడి నుంచి పరారయ్యాడు. అక్కడే ఉన్న కొందరు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై వారు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి సోనేపట్‌లోని సివిల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం బంధువులకు అప్పగించారు.

సంఘటన సమయంలో జట్వాడ గ్రామానికి చెందిన కులదీప్, దీపక్‌లు అక్కడే ఉన్నారని జీఆర్‌పీ స్టేషన్‌ ఇన్‌చార్జి ధర్మపాల్ తెలిపారు. ముకేష్, మను మత్తులో ఎవరు ముందుగా చనిపోతారోనని పంతం పట్టారని ఇద్దరూ పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. అయితే మను ముఖేష్‌ను రైలు ముందుకు నెట్టడంతో ముఖేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి