
పశ్చిమ బెంగాల్‌కు చెందిన దెబాశిష్ దత్తా అనే వ్యక్తి ఇంట్లో పనికిరాని వస్తువులతో ఏకంగా ఓ రోబోను తయారు చేసి అందర్ని ఆశ్చర్యపరిచాడు. వివరాల్లోకి వెళ్తే దెబాశిష్ దత్తా సిలిగురిలోని బాగ్దోగ్రాలో ఉంటున్నాడు. ప్రస్తుతం పాలిటెక్నిక్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే అతనికి రోబోలు అంటే చాలా ఇష్టం. రోబోలను తయారుచేయడమే అతని లక్ష్యం. కానీ అతనికి వాటిని తయారు చేసేందుకు సరిపడా డబ్బులు లేవు. అయితేనేం తన తన తెలివినే పెట్టుబడిగా పెట్టాడు.
తన ఇంట్లోని పనికి రాని వస్తువుల్ని సేకరించాడు. దాదాపు రెండు నెలలు కష్టపడి వాటితోనే ఓ రోబోను తయారు చేశాడు. సీ-ప్రోగ్రామింగ్ సహాయంతో కోడింగ్ చేశాడు. దానిరి నాలుగు చక్రాలు అమర్చి.. బ్లూటూత్‌తో అనుసంధానం చేశాడు. రోబోను నియంత్రించేందుకు రిమోట్ యాప్‌ను రూపొందించాడు. ఆ యాప్ ద్వారా రోబోని కదిలించవచ్చు. ఇంట్లోకి వచ్చే అతిథులకి ఆహారం, నీరు లాంటి వాటిని అందించేలా దెబాశిష్ ఆ రోబోకు తయారుచేశాడు. దానికి బిధు శేఖర్ అనే పేరు కూడా పెట్టాడు. అయితే ఈ రోబో తయారు చేసేందుకు కేవలం రూ.2000 ఖర్చయ్యాయని తెలిపాడు. అలాగే ఈ రోబో అవార్డు ఫంక్షన్‌లలో కూడా అవార్డులు అందిస్తుందని పేర్కొన్నాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.