AC: రాత్రి ఘాడమైన నిద్రలో ఉండగా ఒక్కసారిగా భారీ శబ్ధం.. కళ్లు తెరిచే చూసేసరికి ఏసీ…

|

May 29, 2023 | 8:36 PM

మండుటెండల్లో ఇంటిని కూల్‌ మార్చే ఏసీనే ఆ యువకుడి పాలిట శాపంగా మారింది. ఏసీ పేలిన కారణంగా ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన గుజరాత్‌ రాష్ట్రంలోని కచ్‌ జిల్లాలో ఉన్న ఆదిపూర్‌లో సోమవారం జరిగింది. ఆదిపూర్‌లోని వందనా సొసైటీలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది...

AC: రాత్రి ఘాడమైన నిద్రలో ఉండగా ఒక్కసారిగా భారీ శబ్ధం.. కళ్లు తెరిచే చూసేసరికి ఏసీ...
Representative Image
Follow us on

మండుటెండల్లో ఇంటిని కూల్‌ మార్చే ఏసీనే ఆ యువకుడి పాలిట శాపంగా మారింది. ఏసీ పేలిన కారణంగా ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన గుజరాత్‌ రాష్ట్రంలోని కచ్‌ జిల్లాలో ఉన్న ఆదిపూర్‌లో సోమవారం జరిగింది. ఆదిపూర్‌లోని వందనా సొసైటీలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఏసీలో పేలుడు సంభవించింది. మంటల్లో తీవ్రంగా కాలిన గాయాలతో యువకుడు మృతి చెందాడు.

రాత్రి ఘాడ నిద్రలో ఉండగా ఉన్నట్లుండి ఏసీ పేలడంతో గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న యువకుడు ఊపిరాడక చివరికి శ్వాస విడిచారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఏసీలో పేలుడు జరిగినట్లు గుర్తించారు. విషయం తెలిసిందే వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీలో పేలుడు సంభవించినట్లు పోలీసుల ప్రాథమిక అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నాయి. వేసవిలో సహజంగా ఫ్రిడ్జ్‌, ఏసీలపై లోడ్‌ ఎక్కువగా పడుతుంది.

దీనికారణంగా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో సరైన వైరింగ్ లేక పోయినా ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల్లో ఏవైనా లోపలుంటే కూడా ప్రమాదాలు చోటు చేసుకునే ఛాన్స్‌ ఉంటుందని చెబుతున్నారు. ఏసీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..