AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liver Problems: పిల్లల్లో పెరుగుతున్న లివర్ జబ్బులు… ప్రపంచవ్యాప్తంగా ఇండియా ఏ స్థానంలో ఉందంటే ?

మీ పిల్లలు యక్టివ్ గా ఉన్నారా? అలా అని ఎది పడితే అది తింటున్నారా? అయితే మీ పిల్లలు ప్రమాదం లో పడినట్టే. తాజా అధ్యయనం ప్రకారం చాప కింద నీరులా విస్తరిస్తున్న లివర్ సమస్యలు పిల్లలో ఎక్కువగా కనిపిస్తున్నాయి అని తాజా సర్వేలు చెబుతున్నాయి. లివర్ సమస్య తో బాధ పడుతున్నా ప్రపంచ దేశాల్లో ఇండియా రెండో స్థానంలో ఉంది. ఇది ఇలానే కొనసాగితే ఇక అంతే సంగతులు అంటున్నారు నిపుణులు. సరైన ఫుడ్ డైట్, శారీరక శ్రమ లేకపోతే భవిష్యత్ తరాల సంగతి ఇక అంతే అంటున్నారు.

Liver Problems: పిల్లల్లో పెరుగుతున్న లివర్ జబ్బులు... ప్రపంచవ్యాప్తంగా ఇండియా ఏ స్థానంలో ఉందంటే ?
Liver
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Sep 10, 2023 | 1:44 PM

Share

మీ పిల్లలు యక్టివ్ గా ఉన్నారా? అలా అని ఎది పడితే అది తింటున్నారా? అయితే మీ పిల్లలు ప్రమాదం లో పడినట్టే. తాజా అధ్యయనం ప్రకారం చాప కింద నీరులా విస్తరిస్తున్న లివర్ సమస్యలు పిల్లలో ఎక్కువగా కనిపిస్తున్నాయి అని తాజా సర్వేలు చెబుతున్నాయి. లివర్ సమస్య తో బాధ పడుతున్నా ప్రపంచ దేశాల్లో ఇండియా రెండో స్థానంలో ఉంది. ఇది ఇలానే కొనసాగితే ఇక అంతే సంగతులు అంటున్నారు నిపుణులు. సరైన ఫుడ్ డైట్, శారీరక శ్రమ లేకపోతే భవిష్యత్ తరాల సంగతి ఇక అంతే అంటున్నారు.ఇంతకీ ఏంటి ఆ ప్రమాదం.? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే. మారుతున్న జీవన శైలి,ఆహారపు అలవాట్ల కారణంగా మనకు తెలియని అనేక జబ్బులు మనల్ని వెంటాడుతున్నాయి. ఇందులో లివర్ డిసీజ్ ఒకటి. హార్ట్ ఎటాక్ లాగా సడెన్ డెత్‎లు లేకపోయినా రానున్న రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా లివర్ సంబంధిత జబ్బులు పెరిగి మానవ మనుగడకు ఇబ్బంది కలుగుతుంది అని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇది పెద్దవాళ్ళతో పాటు చిన్నారుల్లోను ఎక్కువ ఇంపాక్ట్ ఉంది అని నిపుణులు అంటున్నారు. ఫ్యాటీ లివర్ కేసుల్లో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతుందని…ముఖ్యంగా చిన్న పిల్లలు వీటి భారిన పడటంలో భారత్ మూడో స్థానంలో ఉందని సీరియస్ వార్నింగ్ చేస్తున్నారు వైద్య నిపుణులు. చిన్న పిల్లలో ప్రస్తుతం లివర్ సమస్యతో బాధపడుతున్న ప్రపంచ దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. ఇండియా రెండో స్థానంలో చైనా మూడో స్థానంలో ఉందని తాజా సర్వేలు చెబుతున్నాయి. అయితే ఇది ఎంత మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ పెను ముప్పుగా మారుతుందని.. అది రానున్న 10 ఏళ్లలో మరణాలకు దారితీసే అవకాశం ఉంది అని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం లివర్ డిసీజ్ తో హాస్పిటల్ కి వచ్చే వారిలో 60 శాతం మంది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‎తో ఇబ్బంది పడేవరేనని లెక్కలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న 35 ఏళ్ళు పై బడిన వారు లివర్ చెకప్ చేసుకుంటే అర్థం అవుతుంది అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.

లివర్ డిసీజ్ రానున్న రోజుల్లో పెను ప్రమాదంగా మారనుంది. అయితే కనీసం ఇప్పటి నుండి అయిన జాగ్రత్తలు పాటిస్తే ముప్పు నుండి బయట పడవచ్చు అనేది నిపుణుల సలహా. మంచి ఫుడ్ డైట్ తీసుకుంటూ,శరీరానికి కొంత వ్యాయామ శ్రమ కలిగిస్తే మంచిది అని వైద్యులు అంటున్నారు. ప్రస్తుత చిన్న పిల్లలు స్కూల్ లలో కనీసం ప్లె గ్రౌండ్ కానీ ,ఆడుకునే సమయం కానీ ఉండటం లేదనీ.. దీని వల్లే అనేక అనర్థాలకు దారి తీస్తుంది అని అంటున్నారు. మంచి డైట్, ఎక్సర్సైజ్,ఆల్కహాల్ కి దూరంగా ఉంటే భవిష్యత్ తరలని ముప్పు నుండి బయటపడే ఛాన్స్ ఉంటుంది అని నిపుణుల సూచనలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
Follow Us
సర్పంచ్‌గా ఒక్క అవకాశం ఇవ్వండి.. రూ.1.50 కోట్లు ఇస్తా
సర్పంచ్‌గా ఒక్క అవకాశం ఇవ్వండి.. రూ.1.50 కోట్లు ఇస్తా
రాత్రంతా మేల్కొని పనిచేస్తున్నారా? గుండె విషయంలో జాగ్రత్త!
రాత్రంతా మేల్కొని పనిచేస్తున్నారా? గుండె విషయంలో జాగ్రత్త!
మహిళల ఆరోగ్యానికి అద్భుతమైన జ్యూస్.. ఇలా తయారు చేసుకోండి!
మహిళల ఆరోగ్యానికి అద్భుతమైన జ్యూస్.. ఇలా తయారు చేసుకోండి!
రూ.1,600 కోట్ల క్లబ్‌లోకి ‘రామాయణం’.. సరికొత్త రికార్డులు!
రూ.1,600 కోట్ల క్లబ్‌లోకి ‘రామాయణం’.. సరికొత్త రికార్డులు!
బ్లైండ్ ఆసియా కప్ ఫైనల్‌లో వివాదం.. బంతిపడకుండానే పాక్‌కు టైటిల్
బ్లైండ్ ఆసియా కప్ ఫైనల్‌లో వివాదం.. బంతిపడకుండానే పాక్‌కు టైటిల్
గోదావరి పుష్కరాలకు లోగో, ట్యాగ్‌లైన్‌ పోటీలు.. విజేతలకు లక్ష
గోదావరి పుష్కరాలకు లోగో, ట్యాగ్‌లైన్‌ పోటీలు.. విజేతలకు లక్ష
వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలా? రోజూ ఈ ఫుడ్స్ తినండి
వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలా? రోజూ ఈ ఫుడ్స్ తినండి
జొన్న రొట్టెలు విరిగిపోకుండా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
జొన్న రొట్టెలు విరిగిపోకుండా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
గొర్రెలు మేపడానికి ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్లాడు.. 2రోజుల తర్వాత..
గొర్రెలు మేపడానికి ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్లాడు.. 2రోజుల తర్వాత..
ఒత్తైన, మెరిసే జుట్టుకు మందారంతో చిట్కాలు.. ఇంట్లోనే నూనె తయారీ!
ఒత్తైన, మెరిసే జుట్టుకు మందారంతో చిట్కాలు.. ఇంట్లోనే నూనె తయారీ!