AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మవారి ఆలయం ముందు ట్రంప్ సార్ కటౌట్.. అసలు మ్యాటర్ ఇదే…

అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మొపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ఉద్దేశిస్తూ.. తమిళనాడులోని ఓ దేవాలయ ఉత్సవాల్లో వినూత్న రీతిలో బ్యానర్‌ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ బ్యానర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ బ్యానర్‌లో ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అమ్మవారి ఆలయం ముందు ట్రంప్ సార్ కటౌట్.. అసలు మ్యాటర్ ఇదే...
Donald Trump Tamil Nadu
SN Pasha
|

Updated on: Feb 20, 2025 | 1:14 PM

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు విజ్ఞప్తి చేస్తూ తిరుపత్తూరు జిల్లాలో జరిగిన ఆలయ ఉత్సవంలో ఓ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. శ్రీ స్వయంభు చాముండేశ్వరి అమ్మన్ ఆలయం తిరుపత్తూరు జిల్లాలోని అంబూర్ పక్కన ఉన్న పెరియంగుప్పం గ్రామంలో ఉంది. ప్రస్తుతం అక్కడ మాసిప్‌ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. అయితే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్న భక్తులకు స్వాగతం పలుకుతూ ప్రత్యేక బ్యానర్ల ఏర్పాటు చేస్తుంటారు. ఇలా అన్ని బ్యానర్లలో వినూత్నంగా ఉన్న బ్యానర్‌కు ప్రైజ్‌మనీ కూడా ఇస్తుంటారు.

ఈ క్రమంలోనే తిరుపత్తూరు ఉత్తర జిల్లాలోని పెరియంగుప్పం కసతోపుకు చెందిన కసతోప్ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళనాడుకు చెందిన స్వచ్ఛంద సేవకులు ఏర్పాటు చేసిన బ్యానర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యానర్‌ సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ బ్యానర్‌లో ఏముందంటే.. “ప్రతి నగరం, ప్రతి ఒక్కరూ మానవతా భావనతో ప్రజలను ప్రేమించాలి” అని రాసి ఉంది. “అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మనుషులందరినీ సమానత్వ భావన చూసే గుణాన్ని ప్రసాదించాలని స్వయంభు శ్రీ చాముండేశ్వరి అమ్మన్ కోరుతూ భక్తులు ప్రార్థనలు చేయాలి” అంటూ బ్యానర్లో పేర్కొన్నారు.

అలా బ్యానర్‌ ఏర్పాటు చేసేందుకు కారణం ఏంటంటే.. ఇటీవలె అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్‌, అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులను అమెరికా నుంచి బలవంతంగా వారివారి దేశాలకు పంపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా మంది భారత పౌరులను అమెరికా ఎయిర్‌ ఫోర్స్‌ విమానల్లో ఖైదీల్లా చేతులకు కాళ్లుకు సంకెళ్లు వీసి తీసుకొచ్చి పంజాబ్‌లోని అమృత్‌ సర్‌లో వదిలేస్తున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఏదో యుద్ధ ఖైదీల్లా భారతీయ పౌరులకు సంకెళ్లు వేయడం ఏంటని అమెరికా ప్రభుత్వాన్ని, ప్రెసిడెంట్‌ ట్రంప్‌ను విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికే మూడు సార్లు అమెరికా ఎయిర్‌ ఫోర్స్ విమానం అమృత్‌ సర్‌లో ల్యాండ్‌ అయి 300 మందికి పైగా భారతీయులను దింపేసి వెళ్లింది. దీంతో అమెరికా అధ్యక్షుడికి మానవతా, సమానత్వ భావన కలిగేలా చూడాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు ఆ బ్యానర్‌ ఏర్పాటు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.