Delhi CM Oath Ceremony: ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం.. హాజరైన ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్.. లైవ్ వీడియో
ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇంటి నుంచి భారీ ర్యాలీతో రామ్‌లీల మైదానానికి చేరుకున్న రేఖాగుప్తా సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఆమెతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. కాగా.. రామ్ లీలా మైదానానికి చేరుకుంటున్న క్రమంలో మార్గ మధ్యలో మర్గట్ వాలే బాబా టెంపుల్‌లో పూజలు నిర్వహించారు. మర్గట్ వాలే బాబా గుడిలో హనుమాన్ ను దర్శనం చేసుకున్నారు.
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతోపాటు ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. రేఖా గుప్తాతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణం చేయించారు. ఢిల్లీకి 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా హిందీలో ప్రమాణం చేశారు. అలాగే.. పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, మంజీందర్ సింగ్ సిర్సా, రవీంద్ర ఇంద్రరాజ్, కపిల్ మిశ్రా, ఆశిష్ సూద్, పంకజ్ సింగ్ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరితో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణం చేయించారు.
రామ్‌లీలా మైదానంలో ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది.. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ, ఎన్డీఏ కూటమికి చెందిన ముఖ్యనేతలు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తోపాటు.. ఎన్డీఏ రాష్ట్రాల సీఎంలు, పలువురు డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు.
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

