Train Ticket: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కౌంటర్ లో టికెట్ కొంటున్నారా.. అయితే ఈ వీడియో మీ కోసమే..

పెరిగిపోతున్న సాంకేతికత, అవసరాలతో పాటు నేరాలు, మోసాలు కూడా యథేచ్ఛగా పెరిగిపోతున్నాయి. జాగ్రత్తగా లేకపోతే మన పక్కనున్న వారి చేతుల్లోనే మోసపోక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. డబ్బులు,..

Train Ticket: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కౌంటర్ లో టికెట్ కొంటున్నారా.. అయితే ఈ వీడియో మీ కోసమే..
Train
Follow us

|

Updated on: Nov 27, 2022 | 7:07 AM

పెరిగిపోతున్న సాంకేతికత, అవసరాలతో పాటు నేరాలు, మోసాలు కూడా యథేచ్ఛగా పెరిగిపోతున్నాయి. జాగ్రత్తగా లేకపోతే మన పక్కనున్న వారి చేతుల్లోనే మోసపోక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. డబ్బులు, వస్తువులను సెకన్ల వ్యవధిలో మాయం చేసే కేటుగాళ్లను మనం చాలా మందినే చూశాం. సాధారణంగా రైల్వే స్టేషన్ కౌంటర్లలో టిక్కెట్లు తీసుకునే సమయంలో చాలా మంది డబ్బులు ఇస్తుంటారు. టికెట్ ప్రైజ్ తీసుకుని మిగతా చిల్లరను తిరిగి ఇస్తుంటారు. అయితే.. ఓ రైల్వే ఉద్యోగి టికెట్ కౌంటర్ లో చేతివాటం ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఢిల్లీలోని హజ్రత్ నిజామోద్దీన్‌ రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి.. టికెట్‌ కోసం కౌంటర్ వద్ద క్యూలో నిలబడ్డాడు. టికెట్ కోసం రూ.500 నోటు ఇచ్చాడు. గ్వాలియర్‌కు టికెట్‌ ఇవ్వమని కోరాడు. ఈ క్రమంలో రైల్వే ఉద్యోగి చేతివాటం చూపించాడు.

మ్యాజిక్‌ చేసినట్లుగా కౌంటర్‌ నుంచి రూ. 20 నోటు తీసి రూ. 500 నోటును దాచేశాడు. ఆ తర్వాత తనకు 20 రూపాయలే ఇచ్చావని, ఇంకా డబ్బులు ఇవ్వాలని అడిగారు. దీంతో విస్తుపోయిన ప్రయాణికుడు తాను రూ.500 నోటు ఇచ్చానని, దానిని దాచేసి రూ.20 నోటు ఇచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నావంటూ ఫైర్ అయ్యాడు. ఇదంతా పక్కనే ఉన్న మరో వ్యక్తి వీడియో తీయడం ఉద్యోగి అసలు విషయం బయట పడింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. నెటిజన్లు వీడియోను రైల్వే ఉన్నతాధికారులకు షేర్‌ చేశారు. ఉద్యోగిపై చర్యలు తీసుకుంటున్నట్టు ఢిల్లీ రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే.. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఇలాంటి మోసాలకు పాల్పడుతుండటం ఆవేదన కలిగిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

Latest Articles