అజిత్ పై కేసులు హుష్ కాకి ! దర్యాప్తు ప్రసక్తే లేదు..

మహారాష్ట్ర సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసి మూడు రోజులైనా గడిచాయో, లేదో.. అప్పుడే అజిత్ తన కేసుల నుంచి బయటపడ్డారు. ఇరిగేషన్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న ఈయనపై దర్యాప్తును రద్దు చేసి 9 కేసులను ఎత్తివేస్తున్నట్టు మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ వెల్లడించింది. ఈ కేసుల్లో ఏవి కూడా అజిత్ కు సంబంధించినవి కావని ఈ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇన్వెస్టిగేషన్ అన్నది […]

అజిత్ పై కేసులు హుష్ కాకి ! దర్యాప్తు ప్రసక్తే లేదు..
Follow us

|

Updated on: Nov 25, 2019 | 9:05 PM

మహారాష్ట్ర సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసి మూడు రోజులైనా గడిచాయో, లేదో.. అప్పుడే అజిత్ తన కేసుల నుంచి బయటపడ్డారు. ఇరిగేషన్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న ఈయనపై దర్యాప్తును రద్దు చేసి 9 కేసులను ఎత్తివేస్తున్నట్టు మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ వెల్లడించింది. ఈ కేసుల్లో ఏవి కూడా అజిత్ కు సంబంధించినవి కావని ఈ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇన్వెస్టిగేషన్ అన్నది రొటీన్ గా జరిగే వ్యవహారమే అని పేర్కొన్నాయి. ఇరిగేషన్ కు సంబంధించిన ఫిర్యాదుల్లో తాము సుమారు 3 వేల టెండర్ల విషయాన్ని దర్యాప్తు చేస్తున్నామని, ఇవి సాధారణంగా జరిపే దర్యాప్తులో భాగమేనని పరమ్ వీర్ సింగ్ అనే అధికారి చెప్పారు. నిజానికి ఫడ్నవీస్ తో బాటు బీజేపీ నేతలు కూడా గతంలో అజిత్ పై అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ వచ్చారు. 2014 లో ఫడ్నవీస్ సీఎం కాగానే.. ఇరిగేషన్ స్కామ్ లో అజిత్ ప్రమేయంపై దర్యాప్తునకు ఆదేశించారు. (అది సుమారు 70 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన భారీ కుంభకోణం). పైగా గత నెలలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ముందు..ఫడ్నవీస్ తన ప్రచారంలో.. అజిత్ పవార్ జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. అయితే తాజాగా సీన్ ఎలా మారిపోయిందో అందరికీ తెలిసిందే..

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..