ఆటో కాదది..మినీ స్టార్‌ హోటల్‌ !

మామూలుగా అయితే, ఆటోలో వసతులు ఎలా ఉంటాయి.?. ఆటోలో వసతులు ఎంటీ..? మహా అయితే, భారీ సైజులో ఉండే ఆటోలో లగ్జరీ సీట్లు, సౌండ్ బాక్స్‌లతో మంచి సంగీతం వినిపిస్తుంది. కానీ, అక్కడ ఓ ఆటోలో మాత్రం ఇంట్లో ఉండే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆటోలో ఉన్న ఫెసిలీటీస్‌ చూసి పలువురు సెలబ్రెటీలు సైతం ఫిదా అయిపోయారట. ముంబయిలో నివసిస్తున్న సత్యవాన్‌ గీతే అనే ఆటో డ్రైవర్‌..తన ఆటోను రీ డిజైన్‌ చేసిన తీరు ప్రస్తుతం సోషల్‌ […]

ఆటో కాదది..మినీ స్టార్‌ హోటల్‌ !
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Nov 25, 2019 | 9:08 PM

మామూలుగా అయితే, ఆటోలో వసతులు ఎలా ఉంటాయి.?. ఆటోలో వసతులు ఎంటీ..? మహా అయితే, భారీ సైజులో ఉండే ఆటోలో లగ్జరీ సీట్లు, సౌండ్ బాక్స్‌లతో మంచి సంగీతం వినిపిస్తుంది. కానీ, అక్కడ ఓ ఆటోలో మాత్రం ఇంట్లో ఉండే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆటోలో ఉన్న ఫెసిలీటీస్‌ చూసి పలువురు సెలబ్రెటీలు సైతం ఫిదా అయిపోయారట. ముంబయిలో నివసిస్తున్న సత్యవాన్‌ గీతే అనే ఆటో డ్రైవర్‌..తన ఆటోను రీ డిజైన్‌ చేసిన తీరు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అతడి ఆలోచనా తీరుకు అంతా అవాక్కవుతున్నారు. ఒక్కసారైన సత్యవాన్‌ ఆటోలో జర్నీ చేయాలని ఆశపడుతున్నారట. సత్యవాన్‌ తన ఆటో ఎక్కిన ప్రయాణికులకు ఇంట్లో కూర్చున్న ఫిలింగ్‌ కలిగేలా వసతులు ఏర్పాటు చేశాడు. ఆటోలో మంచి గార్డెనింగ్‌తో,.. డిజైన్‌గా అమర్చిన పూల కుండీలు, మొక్కలు, అందంగా అలంకరించాడు. ప్రయాణంలో టీవీ చూస్తూ..ఎంజాయ్‌ చేసేలా టీవీని ఏర్పాటు చేశాడు. ఇంకా ఎదైనా తిన్న తర్వాత చేతులు కడుక్కోవటానికి వీలుగా వాష్‌బేసన్‌ కూడా అమర్చాడు. పచ్చని మొక్కలు, పూల మధ్యలో కూర్చుని హాయిగా ప్రయాణించే వారికి సత్యవాన్ ఆటో ఎంతగానో నచ్చుతుందట. ఇన్ని వసతులు ఉన్నప్పటికీ తన ఆటో ఎక్కే ప్రయాణికుల వద్ద డబ్బులు కూడా ఎక్కువగా ఛార్జ్‌ చేయడం లేదు. మీటర్‌ ప్రకారమే తీసుకుంటాడట. దీంతో  సత్యవాన్‌ ఆటోకు మంచి గిరాకీ లభిస్తోంది. అటు ప్రయాణికులూ అద్భుతమైన జర్నీని ఎంజాయ్‌ చేస్తున్నారు.