ఢిల్లీలో భారీ విధ్వంసానికి ప్లాన్‌..భగ్నం చేసిన పోలీసులు

ఢిల్లీలో భారీ విధ్వంసానికి ప్లాన్‌ చేశారు ముష్కర మూకలు. ఐతే అప్రమత్తంగా ఉన్న పోలీసులు వారి కుట్రను భగ్నం చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వారి నుంచి ఐఈడీ బాంబులను స్వాధీనం చేసుకున్నామని..జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలే వారి టార్గెట్‌ అని తెలిపారు ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ డీసీపీ ప్రమోద్‌ కుశ్వాహా. అస్సాం నుంచి వచ్చిన వారికి ఐసిస్‌ ప్రేరేపిత ఉగ్రసంస్థతో సంబంధమున్నట్లు అనుమానిస్తున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఉగ్రదాడులు చేయాలనే […]

ఢిల్లీలో భారీ విధ్వంసానికి ప్లాన్‌..భగ్నం చేసిన పోలీసులు
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Nov 25, 2019 | 5:30 PM

ఢిల్లీలో భారీ విధ్వంసానికి ప్లాన్‌ చేశారు ముష్కర మూకలు. ఐతే అప్రమత్తంగా ఉన్న పోలీసులు వారి కుట్రను భగ్నం చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వారి నుంచి ఐఈడీ బాంబులను స్వాధీనం చేసుకున్నామని..జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలే వారి టార్గెట్‌ అని తెలిపారు ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ డీసీపీ ప్రమోద్‌ కుశ్వాహా. అస్సాం నుంచి వచ్చిన వారికి ఐసిస్‌ ప్రేరేపిత ఉగ్రసంస్థతో సంబంధమున్నట్లు అనుమానిస్తున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఉగ్రదాడులు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.