వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. వావ్ అంటున్న నెటిజన్లు!
సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ.. మార్కెట్‌లో తమ బ్రాండ్‌ను పెంచుకుంటూపోతోంది. ఇక ఇప్పుడు లేటెస్ట్‌గా గ్రూప్‌డ్ స్టికర్స్ అనే ఫీచర్‌ను యూజర్లకు ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు మొబైల్ వెర్షన్‌లోనే వాట్సాప్ యూజర్లు ఈ స్టికర్స్‌ను ఒకరికొకరు పంపించుకుంటుండగా.. మున్ముందు వాట్సాప్ వెబ్‌లో కూడా ఇవి పంపుకునే విధంగా సరికొత్త ఫీచర్‌ను సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే వాట్సాప్ వెబ్ వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయగా.. మీరు పంపించిన గ్రూప్‌డ్ […]

సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ.. మార్కెట్‌లో తమ బ్రాండ్‌ను పెంచుకుంటూపోతోంది. ఇక ఇప్పుడు లేటెస్ట్‌గా గ్రూప్‌డ్ స్టికర్స్ అనే ఫీచర్‌ను యూజర్లకు ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు మొబైల్ వెర్షన్‌లోనే వాట్సాప్ యూజర్లు ఈ స్టికర్స్‌ను ఒకరికొకరు పంపించుకుంటుండగా.. మున్ముందు వాట్సాప్ వెబ్‌లో కూడా ఇవి పంపుకునే విధంగా సరికొత్త ఫీచర్‌ను సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇప్పటికే వాట్సాప్ వెబ్ వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయగా.. మీరు పంపించిన గ్రూప్‌డ్ స్టికర్స్ అన్నీ కూడా చాట్ సెక్షన్‌లో కనిపిస్తాయి. మీరు ఎవరితోనైనా చాట్ చేసినప్పుడు ఒకటి కంటే ఎక్కువ స్టికర్స్ పంపినట్లయితే.. వాటిని ఈ ఫీచర్ గ్రూపుడ్ స్టికర్స్‌గా కన్వర్ట్ చేస్తుంది. ఇక ఈ ఫీచర్ వర్క్ చేస్తుందో లేదో తెలుసుకోవాలంటే.. మీ బ్రౌజర్‌ను ఒకసారి రీ-లోడ్ చేయాల్సి ఉంటుంది. కాగా, ఇటీవల ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ ఫింగర్ ప్రింట్ లాక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి విదితమే.