AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశ చరిత్రలో తొలిసారి.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ గీతానికి ముందే ‘వందేమాతరం ఆలాపన!

దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై మరి కాసేపట్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కాబట్టి ఈ సారి ఇండిపెండెన్స్‌డే ప్రత్యేకలు ఏంటో చూద్దాం.

దేశ చరిత్రలో తొలిసారి.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ గీతానికి ముందే 'వందేమాతరం ఆలాపన!
Indias 80th Independence Day Celebrations
Anand T
|

Updated on: Aug 15, 2026 | 6:40 AM

Share

బ్రిటీష్ పాలన నుంచి భారత్ విముక్తి పొంది అక్షరాల ఎనిమిది పదుల సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా యావత్ భారతదేశమంతా నేడు దేశభక్తి ఉత్సాహాల నడుమ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోంటోంది. ఇప్పటికే ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. మరికాసేపట్లో దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపైనుంచి మువ్వన్నెల జాతీయ జెండాను ప్రధాని మోదీ ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఈ ఏడాది వేడుకల ప్రత్యేకతలు

వందేమాతర ఆలపన: నేడు చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. జాతీయ గేయం వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఇవాళ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట వేడుకల చరిత్రలోనే తొలిసారిగా జాతీయ గీతం కంటే ముందు వందేమాతరం గేయాన్ని ఆలపించనున్నారు.

యువశక్తి – వికసిత్ భారత్: అంతేకాదు ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఎర్రకోట వద్ద వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువశక్తి పాత్రను చాటేలా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.

సైనిక వందనం

గార్డ్ ఆఫ్ ఆనర్: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధానికి స్వాగతం పలికిన అనంతరం, లెఫ్టినెంట్ కల్నల్ అర్జున్ సింగ్ నేతృత్వంలోని త్రివిధ దళాలు, ఢిల్లీ పోలీసుల సంయుక్త విభాగం ప్రధానికి గౌరవ వందనం సమర్పిస్తుంది.

జెండా ఆవిష్కరణ :

ఆ తర్వాత కెప్టెన్ సోనియా సింగ్ చౌహాన్ సహాయంతో ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అదే సమయంలో స్వదేశీ 105mm లైట్ ఫీల్డ్ గన్స్‌తో 21 తుపాకుల వందనం సమర్పిస్తారు. జెండా ఎగురవేసిన వెంటనే భారత వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు ఎర్రకోట ప్రాంగణంపై పూల వర్షం కురిపిస్తాయి.

ప్రత్యేక ఆకర్షణలు

ఎన్‌సీసీ క్యాడెట్ల ప్రదర్శన: జ్ఞాన్‌పథ్‌లో కూర్చున్న 2,500 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు , ‘మై భారత్’ వాలంటీర్లు మానవహారంతో ‘వందేమాతరం’ ఆకృతిని ప్రదర్శిస్తూ గేయాన్ని ఆలపిస్తారు.ఈ వేడుకలకు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన 1,500 మందికి పైగా ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
దేశ చరిత్రలో తొలిసారి.. ఎర్రకోటపై జాతీయ గీతానికి ముందే 'వందేమాతరం
దేశ చరిత్రలో తొలిసారి.. ఎర్రకోటపై జాతీయ గీతానికి ముందే 'వందేమాతరం
ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
పోహా, ఉప్మా, ఇడ్లీ.. ఉదయం ఏది తింటే ఆరోగ్యానికి మంచిది?
పోహా, ఉప్మా, ఇడ్లీ.. ఉదయం ఏది తింటే ఆరోగ్యానికి మంచిది?
ఒంట్లో విపరీత వేడిని చిటికెలో తరిమికొట్టే వడలు
ఒంట్లో విపరీత వేడిని చిటికెలో తరిమికొట్టే వడలు
వాషింగ్ మెషీన్‌కు ఏ డిటర్జెంట్ ఉత్తమమైనది?
వాషింగ్ మెషీన్‌కు ఏ డిటర్జెంట్ ఉత్తమమైనది?
ఆగస్టు 15 రాశిఫలాలు: ఉద్యోగం, పెళ్లి విషయంలో వీరికి అదృష్టం
ఆగస్టు 15 రాశిఫలాలు: ఉద్యోగం, పెళ్లి విషయంలో వీరికి అదృష్టం
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..