AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోరప్రమాదం.. హైవేపై 6 వాహనాలను ఢీకొట్టిన ట్రక్కు .. 8మంది సజీవదహనం

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గురువారం (నవంబర్ 13) పూణేలోని నవ్లే బ్రిడ్జిపై ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రెండు కంటైనర్ ట్రక్కులు ఢీకున్నాయి. వాటిలో ఒకటి మంటల్లో చిక్కుకుంది. రెండు ట్రక్కుల మధ్య ఒక కారు ఇరుక్కుపోయి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది సజీవ దహనం అయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి సహాయక చర్యలు చేపట్టారు.

ఘోరప్రమాదం.. హైవేపై 6 వాహనాలను ఢీకొట్టిన ట్రక్కు .. 8మంది సజీవదహనం
Pune Navale Bridge Accident
Balaraju Goud
|

Updated on: Nov 13, 2025 | 8:17 PM

Share

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గురువారం (నవంబర్ 13) పూణేలోని నవ్లే బ్రిడ్జిపై ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రెండు కంటైనర్ ట్రక్కులు ఢీకున్నాయి. వాటిలో ఒకటి మంటల్లో చిక్కుకుంది. రెండు ట్రక్కుల మధ్య ఒక కారు ఇరుక్కుపోయి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది సజీవ దహనం అయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి సహాయక చర్యలు చేపట్టారు. కాలిపోతున్న వాహనాల్లో మరింత మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. యాక్సిడెంట్‌ తరువాత హైవేపై భారీగా ట్రాఫిక్‌జామ్‌

పూణే నగర శివార్లలోని ముంబై-బెంగళూరు హైవేపై ఈ సంఘటన జరిగింది. రెండు పెద్ద కంటైనర్ ట్రక్కుల మధ్య ఒక కారు నుజ్జునుజ్జు కావడంతో ఎనిమిది మంది మరణించారు. నవ్లే బ్రిడ్జిపై సాయంత్రం జరిగిన ప్రమాదంలో అనేక మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసు అధికారి తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. రెండు భారీ ట్రక్కులు ఢీకొనడం, ట్రక్కులు పేలి మంటలు చెలరేగడం, ఒక కారును ధ్వంసం చేయడం స్పష్టంగా కనిపించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు వెల్లడించారు.

ప్రమాదం ఎలా జరిగిందో మేము దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు. ప్రస్తుతం, గాయపడిన వారికి తక్షణ ఆసుపత్రి చికిత్స అందేలా చూడడమే మా ప్రాధాన్యత అని ఒక పోలీసు అధికారి తెలిపారు. అగ్నిమాపక శాఖ సంఘటనా స్థలానికి నీటి ట్యాంకర్లను పంపిందని, మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ ఘోర ప్రమాదం రద్దీగా ఉండే హైవేపై జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..