Coronavirus: ఆ 10 రాష్ట్రాల్లోనే 76 శాతం కరోనా పాజిటివ్‌ కేసులు: కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి

Coronavirus: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అయితే ఫస్ట్‌ వేవ్‌ కంటే సెకండ్‌ వేవ్‌లో తీవ్ర స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ఇటీవల నుంచి..

Coronavirus: ఆ 10 రాష్ట్రాల్లోనే 76 శాతం కరోనా పాజిటివ్‌ కేసులు: కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి
Follow us
Subhash Goud

|

Updated on: May 21, 2021 | 5:36 PM

Coronavirus: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అయితే ఫస్ట్‌ వేవ్‌ కంటే సెకండ్‌ వేవ్‌లో తీవ్ర స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ఇటీవల నుంచి దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టాయి. నమోదైన కొత్త కేసుల్లో 76.66 శాతం కేసులు పది రాష్ట్రాల్లోనే నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు దేశంలో గత ఎనిమిది రోజులుగా కొత్తగా నమోదైయ్యే పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టినట్లు తెలిపింది. గడిచిన 24 గంటల్లో పాజిటివిటీ రేటు 12.59కు తగ్గింది. కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య తగ్గుతుండటంతో భారత్‌లో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 30,27,925కు చేరింది. మరోవైపు దేశంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,27,12,735కు చేరింది. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్న పది రాష్ట్రాల్లో తమిళనాడు (35,579 మొదటి స్థానంలో ఉండగా, కేరళ (30,491) రెండో స్థానం, ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, పశ్చిమబెంగాల్‌, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌, అసోం, రాజస్థాన్‌ రాష్ట్రాలు ఉన్నాయి.

అయితే కరోనా కట్టడికి అన్ని చర్యలు చేపడుతోంది. సెకండ్‌వేవ్‌లో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసులు తీవ్రంగా ఉండటంతో దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కొనసాగిస్తున్నాయి. మాస్క్‌లు ధరించని వారిపై కఠిన చర్యలు చేపడుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

Oxygen: మీ మొబైల్‌లోనే ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోవచ్చు.. యాప్‌కు రూపకల్పన చేసిన కోల్‌కతాకు చెందిన అంకుర సంస్థ

నెల్లూరు ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయాలి: ఆయూష్‌, ఐసీఎంఆర్‌కు సూచించిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..