Resume Lab survey: ఎంత మంది ఉద్యోగార్ధులు తమ CVలో అబద్ధాలు చెబుతారు? సర్వేలో తేలిన షాకింగ్ విషయాలు
ఒకప్పుడు వంద అబద్దాలు చెప్పి అయినా ఒక పెళ్లి చేయాలి అనే వారు. కానీ ఇప్పుడు వెయ్యి అబద్దాలు చెప్పి అయినా ఒక ఉద్యోగం సంపాధించాలని భావిస్తున్నారు. రెజ్యూమ్ అనేది ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు ఉపయోగపడే ఒక ప్రక్రియ. ఇందులో తన పేరు, చిరునామా, ఫోన్ నంబర్‌తో పాటూ అనుభవానికి సంబంధించిన వివరాలు నమోదు చేస్తారు. అయితే ఇటీవల కాలంలో ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తున్నారని తేలింది. దీంతో

ఒకప్పుడు వంద అబద్దాలు చెప్పి అయినా ఒక పెళ్లి చేయాలి అనే వారు. కానీ ఇప్పుడు వెయ్యి అబద్దాలు చెప్పి అయినా ఒక ఉద్యోగం సంపాధించాలని భావిస్తున్నారు. రెజ్యూమ్ అనేది ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు ఉపయోగపడే ఒక ప్రక్రియ. ఇందులో తన పేరు, చిరునామా, ఫోన్ నంబర్‌తో పాటూ అనుభవానికి సంబంధించిన వివరాలు నమోదు చేస్తారు. అయితే ఇటీవల కాలంలో ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తున్నారని తేలింది. దీంతో 42శాతం మంది ఇంటర్వూలలో ఫేక్ అనుభవం ఉన్నట్లు గుర్తించి తిరస్కరణకు గురైనట్లు సమాచారం. సాధారణంగా ఇంటర్వూలలో నిజాయితీగా ఉండాలి. అది మన కెరీర్‌వకి కాస్త దోహదపడుతుంది.
ఇంటర్వూకి వచ్చిన వ్యక్తి స్కిల్‌తో పాటూ ప్రవర్తనపై కూడా ఒక్కో సారి ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ తమ రెజ్యూమ్‌లలో అబద్దాలతో కూడిన అనుభవాలు, ప్రమోషన్లు, వేతనాలను నమోదు చేస్తున్నట్లు రెజ్యూమ్ ల్యాబ్ సర్వేలో వెల్లడైంది. దాదాపు 1914 మందిపై సర్వే నిర్వహించగా అందులో 52శాతం మంది తప్పుడు అనుభవాలతో రెజ్యూమ్‌లను అందించారి ఒక అధ్యయనం నివేదించింది. 27% మంది ఒకటి లేదా రెండు అబద్దాలు చెప్పేవారు కాగా.. 71% మంది పూర్తి స్థాయిలో అబద్ధాలు చెప్పేవారుగా పేర్కొంది. ఇందులో 37% మంది తాము అబద్దాలు చెబుతున్నట్లు అంగీకరించారు. ఈ సంవత్సరం ఆగస్టులో రెజ్యూమ్‌పై అబద్ధాల రేట్లు పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడించింది.
ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న వారు తమ అవసరాల కోసం అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తారు. ఈ సందర్భంగా లేని స్కిల్స్ ఉన్నట్లు చూపిస్తారు. చదవని చదువును చదివినట్లు రాస్తారు. లేని అనుభవాన్ని ఉన్నట్లు పొందుపరుస్తారు. తద్వారా భవిష్యత్తు పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల ఒక్కోసారి పరిశ్రమలో ఉన్న వారితో మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి దారితీస్తుందని చెబుతున్నారు. ఒకవేళ పట్టుబడితే తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని ఒక్కోసారి కేసులతో పాటూ జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందుకే “ఉద్యోగ దరఖాస్తులు చేసుకున్నప్పుడు ఇంటర్వ్యూలలో ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండటం అనేది ఉత్తమమైన విధానంగా చెబుతున్నారు.
తాత్కాలిక లేదా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అనుభవాన్ని, నైపుణ్యన్ని తప్పుడుగా చూపించేబదులు ఏదో ఒక అనుభవాన్ని, నైపుణ్యాన్ని గణించడం ఉత్తమం అంటున్నాయి ఈ నివేదికలు. బ్యాచిలర్ డిగ్రీ పట్టా కలిగిన వారిలో 49% మంది అబద్దాలు చెబుతుంటే.. డిగ్రీ పట్టా లేని వాళ్ళలో 73% మంది తప్పుడు వివరాలను సమర్పిస్తున్నట్లు వెల్లడైంది. వీరందరి కంటే కూడా 80% మంది కార్మికులు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం తరచూ అసత్యాలు చెబుతున్నట్లు నివేదికలో తెలిపింది. ఉద్యోగ ఇంటర్వూకి సిద్దమయ్యేకి ముందు మీ రెజ్యూమ్‌ని కచ్చితమైన అంశాలతో సిద్దం చేసుకోవాలి. పొరుగు వ్యక్తుల వివరాలను ఎడిట్ చేయడం, వారి నైపుణ్యాన్ని, అనుభవాన్ని తమదిగా నమోదు చేయకూడదు. అలా చేసిన వారు 63%గా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..