Watch Video: ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం రద్దీగా ఉండే రోడ్డుపై యోగా టీచర్ విన్యాసాలు.. పంతులమ్మకు గట్టి గుణపాఠం నేర్పిన పోలీసులు..
ఈ ప్రత్యేక సంఘటనను పక్కన పెడితే, తాను ఎప్పుడూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తానని, మిగతా వారందరినీ అదే విధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరింది. ఇకపోతే, ఈ వైరల్ క్లిప్‌ను మొదట సెప్టెంబర్ 23న పోస్ట్ చేసినప్పటికీ, అది ఇప్పుడు ఇంటర్నెట్‌లో విస్తృతంగా వైరల్ అవుతూ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం..
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ ఫీచర్‌కు జనాల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. రీల్స్ తయారు చేసే వారి సంఖ్య కూడా లెక్కలేనంతా పెరుగుతోంది. యూజర్లు తమ రీల్స్‌తో వినియోగదారులను ఆకర్షించేందుకు అనేక చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇటీవల గుజరాత్‌లో ఓ అమ్మాయి రీల్స్ షూట్ చేస్తూ నడి రోడ్డు మధ్యలో యోగా చేయడం ప్రారంభించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ రహదారి ఖాళీగా లేదు.. రద్దీగా ఉండే నగర రహదారిపై యువతి రీల్స్ చేయటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఓ యువతి మార్గమధ్యలో యోగా చేస్తూ కనిపించింది. కొన్ని లైక్స్, వ్యూస్ కోసం, అమ్మాయి తన జీవితాన్ని పణంగా పెట్టడమే కాకుండా ఇతర వాహనదారులను కూడా ప్రమాదంలో పడేసింది.
ఈ వీడియో క్లిప్‌లో, 40 ఏళ్ల వయసున్న దీనా పర్మార్ అనే యోగా ట్రైనర్.. రోడ్డు మధ్యలో అడ్డంగా యోగా చేసింది. దీంతో ఆ మార్గంలో వచ్చిన వాహనాలు ఎక్కడిక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. అయితే, సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో విషయం గుజరాత్ పోలీస్ డిపార్ట్‌మెంట్ దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు మహిళపై చర్యలు తీసుకున్నారు. మహిళను శిక్షించారా లేదా క్షమాపణలు చెప్పి వార్నింగ్ ఇచ్చారా అనేది ప్రస్తుతం తెలియదు. కానీ, పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ విషయంలో ఆమెకు తగిన గుణపాఠం చెప్పారని మాత్రం అర్థమవుతుంది. పోలీసులు ఆమెతో ట్రాన్సిషన్ రీల్ చేశారు. దాని ద్వారా యువతి తన తప్పుకు క్షమాపణలు చెప్పడం, బహిరంగంగా ఇలా రోడ్లపై ఇలాంటి విన్యాసాలు చేయడం ప్రమాదకరమని స్వయంగా ఆ మహిలే అంగీకరించడం కనిపించింది.
View this post on Instagram
పోలీసులు చేయించిన రీల్స్ లో ఆమె తన చర్యలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. తాను ట్రాఫిక్ నిబంధనలను పాటించడం లేదని ఆమె అంగీకరించింది. ఈ ప్రత్యేక సంఘటనను పక్కన పెడితే, తాను ఎప్పుడూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తానని, మిగతా వారందరినీ అదే విధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరింది. ఇకపోతే, ఈ వైరల్ క్లిప్‌ను మొదట సెప్టెంబర్ 23న పోస్ట్ చేసినప్పటికీ, అది ఇప్పుడు ఇంటర్నెట్‌లో విస్తృతంగా వైరల్ అవుతూ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ప్రజలు తమ ప్రాణాలను, ఇతరులను పణంగా పెట్టడం ఇదేం మొదటిసారి కాదు. ఇలాంటి సందర్భాలు తరచుగా వైరల్ అవుతుంటాయి.
భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని పలు సెక్షన్ల ఏదైనా బహిరంగ ప్రదేశంలో ఇతరులకు ప్రమాదం లేదా ఇబ్బంది కలిగించే వ్యక్తికి శిక్ష విధించబడుతుంది. ఇది ఆరు నెలల వరకు పొడిగించబడే జైలు శిక్ష లేదా జరిమానాను కూడా ఉండే అవకాశం ఉంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..