
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో రైలులో అక్రమంగా 59 పిల్లలను తరలించడం కలకలం రేపింది. సమాచారం మేరకు ఆర్పీఎఫ్ సిబ్బంది, పోలీసులు పిల్లల్ని సురక్షితంగా కాపాడారు. వివరాల్లోకి వెళ్తే బిహార్‌కు చెందిన 59 మంది చిన్నారులను దానాపూర్-పూణె ఎక్స్‌ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో ఓ ఎన్జీవో సంస్థ సిబ్బంది, స్థానిక పోలీసులు, ఆర్పీఫ్ సిబ్బంది హుటాహుటీనా రంగంలోకి దిగారు. బుధవారం ఉదయంపూట ఆ రైలు భూసావల్ రైల్వే స్టేషన్‌కు చేరింది. ఈ క్రమంలో పోలీసులు, ఆర్పీఫ్ సిబ్బంది అన్ని కంపార్ట్‌మెంట్‍లను తనిఖీ చేశారు. మొదటగా ఆ స్టేషన్‌లో 29 మంది పిల్లల్ని రక్షించారు.
ఆ తర్వాత మన్మాడ్ స్టేషన్‌కు ఆ రైలు చేరిన తర్వాత మరో 30 మంది పిల్లల్ని రక్షించారు. సుమారు 8 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న ఈ 59 మంది పిల్లల్ని బిహార్ నుంచి మహారాష్ట్రలోని సాంగ్లీకి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మానవ అక్రమ రవాణా నేరం కింద ఐదుగురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు, ఎన్జీఓ సిబ్బంది సహాకారం వల్లే పిల్లల అక్రమ రవాణాను అరికట్టినట్లు ఆర్పీఎఫ్ వెల్లడించింది.
#RPF @BBAIndia, PRAYAS with state police came together to bust a #ChildTrafficking ring, leading to the rescue of 59 children with arrest of 5 traffickers at Bhusawal and Manmad stations.
A powerful collaboration making a tangible difference in the fight against exploitation. pic.twitter.com/CJRv2fmlt6
— RPF INDIA (@RPF_INDIA) May 31, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం