AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chennai: శివాలయ ఉత్సవాల్లో అపశ్రుతి.. ఆలయ కొలనులో మునిగి ఐదుగురు అర్చకుల దుర్మరణం

శివాలయ ఉత్సవాల్లో భాగంగా చెన్నైలోని కీలకట్టలై ప్రాంతానికి సమీపంలోని ధర్మలింగేశ్వర దేవాలయంలో పూజలు జరుగుతున్న సమయంలో..కొలనులోకి దిగిన ఐదుగురు అర్చకులు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా మారడంతో శివాలయంలో తీవ్ర విషాదం నెలకొంది.

Chennai: శివాలయ ఉత్సవాల్లో అపశ్రుతి.. ఆలయ కొలనులో మునిగి ఐదుగురు అర్చకుల దుర్మరణం
Temple Pond
Basha Shek
|

Updated on: Apr 06, 2023 | 6:45 AM

Share

తమిళనాడులోని ఓ శివాలయ ఉత్సవాల్లో అపశృతి దొర్లింది. కొలనులో దిగి శివపూజలు చేస్తోన్న ఐదుగురు అర్చకులు ప్రమాదవశాత్తూ కొలనులో మునిగి చనిపోయారు. ఈ ఘటన బాధిత కుటుంబాలను అంతులేని విషాదంలో ముంచింది. శివాలయ ఉత్సవాల్లో భాగంగా చెన్నైలోని కీలకట్టలై ప్రాంతానికి సమీపంలోని ధర్మలింగేశ్వర దేవాలయంలో పూజలు జరుగుతున్న సమయంలో..కొలనులోకి దిగిన ఐదుగురు అర్చకులు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా మారడంతో శివాలయంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతులంతా 18 నుంచి 23 ఏళ్ళ వయస్సువారే. శివాలయ ఉత్త్సవాలలో భాగంగా పూజల కోసం కొలను లోకి దిగారు అర్చకులు. పూజల్లో భాగంగా నీటిలోకి దిగిన అర్చకుల్లో కొందరు ఆ పరమేశ్వరుడికి పూజలు చేస్తుండగానే ఒక్కసారిగా నీటిలోకి మునిగిపోయారు. అందరూ ఈ అనూహ్యపరిణామానికి నిశ్చేష్టులయ్యారు. మునిగిపోతున్న అర్చకులు హాహాకారాలు విని కూడా ఏమీచేయలేని స్థితిలో..అక్కడి వారు ప్రేక్షకులుగా ఉండిపోయారు.

అందరూ చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోతోన్న అర్చకులను కొందరు కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అప్పటికే కొలను లోలోపలికి కొట్టుకుపోయి మునిగిపోయారు ఐదుగురు అర్చకులు. ఈ విషాద ఘటనలో ఐదుగురు చనిపోగా మరికొందరి పరిస్థితి విషమంగా మారింది. అర్చకుల భౌతిక కాయాల కోసం పోలీసులు కొలనులో గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?