Road Accident: కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొట్టిన కారు.. ఐదుగురు దుర్మరణం.. మరో ముగ్గురికి..

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముంబై - పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు.

Road Accident: కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొట్టిన కారు.. ఐదుగురు దుర్మరణం.. మరో ముగ్గురికి..
Road Accident

Updated on: Nov 18, 2022 | 9:50 AM

Mumbai-Pune Expressway Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముంబై – పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన పన్వెల్‌లోని ఖోపోలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణిస్తున్న కారు మరొక వాహనాన్ని ఢీకొందని.. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారనని అధికారులు తెలిపారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో మరణించినట్లు పేర్కొన్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని.. వారికి చికిత్స కొనసాగుతోందని.. రాయ్‌ఘడ్‌లోని ఖోపోలీ (Khopoli) పోలీసులు వెల్లడించారు.

సమాచారం ప్రకారం.. తొమ్మిది మంది ప్రయాణికులతో వేగంగా వెళ్తున్న కారు.. వెనుక నుంచి కంటైనర్ వాహనాన్ని ఢీకొట్టింది.. దీంతో వాహనం నుజ్జునుజ్జయింది. స్థానికులు సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. తీవ్రగాయాలైన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పన్వేల్‌లోని కమోతేలోని ఎంజీఎం ఆస్పత్రిలో నలుగురికి చికిత్స కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కారు డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై ఖోపోలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని.. పోలీసులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..