పలు విద్యాసంస్థలకు బాంబు బెదిరింపు కాల్స్.. రంగంలోకి పోలీసులు, బాంబ్ స్క్వాడ్స్
విద్యాలయాలకు బాంబు బెదిరింపులతో ఈమెయిల్ రావడంతో ఆయా విద్యా సంస్థలు అధికారులకు విషయాన్ని తెలిపాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, బాంబు స్క్వాడ్ సిబ్బంది రంగంలోకి దిగారు. అన్నీ స్కూల్స్‌లో విస్తృత తనిఖీలు చేపట్టారు.
తమిళనాడులోని పలు విద్యాసంస్థలకు బాంబు బెదిరింపు కాల్స్ రావటం కలకలం రేపింది. మధురైలోని మూడు పాఠశాలలకు సెప్టెంబర్ సోమవారం 30న బాంబు బెదిరింపు ఇ-మెయిల్స్ అందండంతో సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ముధురైలోని కేంద్రీయ విద్యాలయ, జీవన స్కూల్, వేలఅమ్మాల్ విద్యాలయాలకు బాంబు బెదిరింపులతో ఈమెయిల్ రావడంతో ఆయా విద్యా సంస్థలు అధికారులకు విషయాన్ని తెలిపాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, బాంబు స్క్వాడ్ సిబ్బంది రంగంలోకి దిగారు. అన్నీ స్కూల్స్‌లో విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఇదిలా ఉంటే, తెలంగాణలో అన్నీ స్కూల్స్‌కి 10రోజుల పాటు సెలవులు ప్రకటించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 1న నుండి అక్టోబర్ 13వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 12న దసరా పండుగ ఉంటుంది. అందువల్ల పండుగ తర్వాతి రోజు కూడా సెలవు ఇచ్చారు. తిరిగి స్కూళ్లు అక్టోబర్ 14న ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఈ మేరకు ఆయా విద్యాసంస్థలు కూడా ప్రకటించాయి.
ఇదిలా ఉండగా, ఏపీ ప్రభుత్వం దసరా సెలవుల్లో కొన్ని కీలక మార్పులు చేసింది. అధికారికంగా సెలవుల పైన స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులు, పలు సంఘాల విజ్ఞప్తితో ఒకరోజు ముందుగానే సెలవులు ఇస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..