Sahitya Akademi Awards 2023 Full List: 24 మందికి సాహిత్య అకాడమీ అవార్డులు.. ఏయే విభాగాల్లో ఎవరెవరు ఎంపికయ్యారంటే
ఆంగ్ల రచయిత్రి నీలం సరణ్ గౌర్, హిందీ నవలా రచయిత సంజీవ్‌సహా మొత్తం 25 మంది రచయితలకు 2023 సంవత్సరానికి గానూ బుధవారం (డిసెంబర్ 20) సాహిత్య అకాడమీ అవార్డులు ప్రధానం చేశారు. మాధవ్ కౌశిక్ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో భేటీ అయిన అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు 24 భారతీయ భాషలకుగాను జ్యూరీ సభ్యులు సూచించిన పేర్లకు ఆమోదం తెలిపినట్లు సాహిత్య అకాడమీ ప్రకటించింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ఆంగ్ల రచయిత్రి నీలం సరణ్ గౌర్, హిందీ నవలా రచయిత సంజీవ్‌సహా మొత్తం 25 మంది రచయితలకు 2023 సంవత్సరానికి గానూ బుధవారం (డిసెంబర్ 20) సాహిత్య అకాడమీ అవార్డులు ప్రధానం చేశారు. మాధవ్ కౌశిక్ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో భేటీ అయిన అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు 24 భారతీయ భాషలకుగాను జ్యూరీ సభ్యులు సూచించిన పేర్లకు ఆమోదం తెలిపినట్లు సాహిత్య అకాడమీ ప్రకటించింది. తొమ్మిది కవితా సంపుటాలు, ఆరు నవలలు, ఐదు చిన్న కథలు, మూడు వ్యాసాలు, ఒక సాహిత్య అధ్యయనానికి ఈ అవార్డులు దక్కాయి.
24 భారతీయ భాషలకు ప్రకటించిన రచయితలు వీరే
- కవిత్వంలో విజయ్ వర్మ (డోగ్రీ), వినోద్ జోషి (గుజరాతీ), మన్షూర్ బనిహాలి (కాశ్మీరి), సోరోఖైబామ్ గంభీని (మణిపురి), అశుతోష్ పరిదా (ఒడియా), గజే సింగ్ రాజ్‌పురోహిత్ (రాజస్థానీ), అరుణ్ రంజన్ మిశ్రా (సంస్కృతి), వినోద్ అసుదాని (సింధీ) కవిత్వంలో అవార్డులు అందుకున్నారు. స్వర్ణ్‌జిత్ సావి పంజాబీలో ‘మన్ డి చిప్’ కవితా సంపుటి పుస్తకానికి అవార్డు దక్కింది.
- నవలలకు ‘ముఝే పెహ్చానో’ అనే హిందీ నవలకుగాను సంజీవ్‌కు, ‘రెక్వియమ్ ఇన్ రాగా జాంకీ’ పుస్తకానికిగాను నీలం సరణ్ గౌర్, ఉర్దూలో సాదిక్వా నవాబ్ సాహెర్ అనే రచయిత్రి రాసిన ‘రాజ్‌దేవ్ కి అమ్రాయ్’ పుస్తకానికి అవార్డు ప్రకటించారు. ఇంకా స్వప్నమయ్ చక్రబర్తి (బెంగాలీ), కృష్ణత్ ఖోట్ (మరాఠీ), రాజశేఖరన్ దేవిభారతి (తమిళం) వంటి రచయితలు వారి నవలలకు అవార్డు దక్కింది.
- చిన్న కథలకు ప్రణవ్‌జ్యోతి దేకా (అస్సామీ), నందీశ్వర్ దైమాన్ (బోడో), ప్రకాష్ ఎస్ పరీంకర్ (కొంకణి), తారాసీన్ బాస్కీ (తురియా చాంద్ బాస్కీ) (సంతాలి), టి పతంజలి శాస్త్రి (తెలుగు) వారి వారి రచయితలు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
- వ్యాసాలకు లక్ష్మీషా తోల్పాడి (కన్నడ), బసుకినాథ్ ఝా (మైథిలి), జుధాబీర్ రాణా (నేపాలీ) వ్యాసాలకు అవార్డు దక్కింది
మలయాళంలో చేసిన సాహిత్య అధ్యయనానికి గానూ EV రామకృష్ణన్‌కు సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం చేయనున్నారు.
ఈ అవార్డుకు ఎంపికైన రచనలు ఐదు సంవత్సరాలలో.. అంటే 1 జనవరి 2017 నుంచి 31 డిసెంబర్ 2021 మధ్య కాలంలో ప్రచురించబడిన పుస్తకాలకు సంబంధించినవి. రాగి ఫలకంపై రచయితలు, కవుల పేర్లు చెక్కిన అవార్డులను వచ్చే ఏడాది మార్చి 12న కమానీ ఆడిటోరియంలో నిర్వహించే వేడుకలో శాలువా కప్పి, రూ.లక్ష నగదును అందించి ఘనంగా సత్కరించనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.