PM Narendra Modi: ‘అభివృద్ధి పథంలో టేకాఫ్ దిశగా భారత్’: పీఎం నరేంద్ర మోడీ..
భారతదేశ విదేశాంగ విధానాలపై మాట్లాడుతూ..మిక్స్-అండ్-మ్యాచ్ విధానాలను అనుసరిస్తోందని అన్నారు. దీంతో ప్రస్తుతం భారత్ "స్వీట్ స్పాట్"గా మారిందంటూ తెలిపారు. “విదేశీ వ్యవహారాలలో మా ముందున్న మార్గదర్శక సూత్రం మన జాతీయ ప్రయోజనాలే” అని మోదీ అన్నారు. "ఈ వైఖరి పరస్పర ప్రయోజనాలను గౌరవించేలా, సమకాలీన భౌగోళిక రాజకీయాల సంక్లిష్టతలను గుర్తించే పద్ధతిలో వివిధ దేశాలతో సన్నిహితంగా ఉండటానికి అనుమతిస్తుంది" అంటూ చెప్పుకొచ్చారు.
PM Narendra Modi: భారతదేశం ప్రస్తుతం అభివృద్ధి పథంలో టేకాఫ్ దిశగా దూసుకపోతోందని, దీనిని మరింత వేగవంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ నెలలో నిర్వహించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడింట్లో బీజేపీ ఘనవిజయం సాధించి, మరోసారి అదికారన్ని చేపట్టిన సందర్భంలో ఫైనాన్షియల్ టైమ్స్ ఓ ఇంటర్వ్యూ చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని పై విధంగా చెప్పుకొచ్చారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను, ప్రపంచవ్యాప్తంగా దేశ గౌరవాన్ని పెంపొందించామని, ఈ క్రమంలో మిలియన్ల ప్రజల జీవితాలను మెరుగుపడ్డాయని, అందుకే మూడు రాష్ట్రాల్లో అద్యధిక మెజారిటీ వచ్చిందని ఆయన అన్నారు.
“మాపై విమర్శకులు చేసే వారికి ఐదు రాష్ట్రాల ఎన్నికలే ఓ చెంపపెట్టు అని, వారి అభిప్రాయాలు, వాటిని వ్యక్తీకరించే స్వేచ్ఛకు వారు అర్హులు. అయితే ఈ వాదనలు భారతీయ ప్రజల తెలివితేటలను అవమానించడమే కాకుండా వైవిధ్యం, ప్రజాస్వామ్యం వంటి విలువలపై వారి లోతైన నిబద్ధతను తక్కువగా అంచనా వేసేలే చేస్తున్నాయని’ ప్రధాని తెలిపారు. “రాజ్యాంగాన్ని సవరించడం గురించి వచ్చే ఎలాంచి చర్చ అయిన అర్థరహితమే” అని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు.
‘మా ప్రభుత్వం చేపట్టిన “క్లీన్ ఇండియా” దేశవ్యాప్తంగా మరుగుదొడ్ల నిర్మాణ ప్రచారం నుంచి దాదాపు 1 బిలియన్ల మంది ప్రజలను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చేలా చేసింది. అలాగే, మా ప్రభుత్వం చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు రాజ్యాంగాన్ని సవరించకుండానే చేశామంటూ” విమర్శకులకు సూటిగా ప్రశ్నించారు.
ఫ్రెండ్లీ విదేశాంగ విధానాలు..
భారతదేశ విదేశాంగ విధానాలపై మాట్లాడుతూ..మిక్స్-అండ్-మ్యాచ్ విధానాలను అనుసరిస్తోందని అన్నారు. దీంతో ప్రస్తుతం భారత్ “స్వీట్ స్పాట్”గా మారిందంటూ తెలిపారు. “విదేశీ వ్యవహారాలలో మా ముందున్న మార్గదర్శక సూత్రం మన జాతీయ ప్రయోజనాలే” అని మోదీ అన్నారు. “ఈ వైఖరి పరస్పర ప్రయోజనాలను గౌరవించేలా, సమకాలీన భౌగోళిక రాజకీయాల సంక్లిష్టతలను గుర్తించే పద్ధతిలో వివిధ దేశాలతో సన్నిహితంగా ఉండటానికి అనుమతిస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు.
అమెరికాతో భారత్ సన్నిహిత సంబంధాలను కూటమిగా అభివర్ణించవచ్చా అనే ప్రశ్నపై సమాధానమిస్తూ.. ఈ నేపథ్యంలోనే అమెరికా నేరారోపణను ప్రధాని మోదీ ఖండించారు. ఈ వ్యవహారంలో దౌత్యపరమైన ప్రభావాన్ని తగ్గించడానికి భారత ప్రధాని ప్రయత్నించారు. “ఏదైనా సాక్ష్యాలను పరిశీలిస్తాను కానీ తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు”. ఇలాంటి ఘటనలు అమెరికా-భారత్ సంబంధాలను దెబ్బతీస్తుందన్నారు మోదీ. ఎవరైనా మాకు ఏదైనా సమాచారం ఇస్తే తప్పకుండా పరిశీలిస్తామని మోదీ అన్నారు. “ భారత పౌరుడు ఏదైనా మంచి లేదా చెడు చేసినట్లయితే, మేం దానిని పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నాం. మా నిబద్ధత చట్ట పాలనపై ఉంది” అని ప్రధాని స్పష్టం చేశారు.
దేశంలో ముస్లిం మైనారిటీకి భవిష్యత్తు..
భారతదేశంలో ముస్లిం మైనారిటీకి భవిష్యత్తుపై వస్తోన్న విమర్శలపై మాట్లాడుతూ.. “భారతీయ సమాజానికి ఏ మతపరమైన మైనారిటీ పట్ల వివక్ష భావం లేదు. దేశంలో నివసించే వారికి కూడా ఎలాంటి మతపరమైన భేదాలు ఉండవు” అని ప్రకటించారు. “మన దేశంలో అందుబాటులో ఉన్న స్వేచ్ఛను ఉపయోగించుకుని, సంపాదకీయాలు, టీవీ ఛానెల్‌లు, సోషల్ మీడియా, వీడియోలు, ట్వీట్లు మొదలైన వాటి ద్వారా ప్రతిరోజూ మాపై ఈ ఆరోపణలను చేస్తూనే ఉంటారు. అలా చేసే హక్కు వారికి ఉంది. కానీ, వాస్తవాలతో ప్రతిస్పందించడానికి ఇతరులకు కూడా సమాన హక్కు ఉంది” అని ఘాటుగా స్పందించారు.
“1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో బ్రిటిష్ వారు భారతదేశ భవిష్యత్తు గురించి చాలా భయంకరమైన అంచనాలు వేశారు. కానీ, ఆ అంచనాలు అన్నీ అబద్ధమని నిరూపితమయ్యాయి. అలాగే, నేడు మా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేవారు కూడా త్వరలోనే తమ తప్పులు తెలుసుకుంటారు” అని మోడీ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..