Road Stolen: ఇదేం వింత కేసు! మా ఊరిలో రోడ్డు పోయిందంటూ గ్రామస్తుల ఫిర్యాదు.. ఎక్కడంటే?
''మా ఇల్లు ఎక్కడో పోయింది.. కనిపియలేదు'' అని 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాలో చిన్నారి చెప్పే డైలాగు మీకు గుర్తుండొచ్చు. సరిగ్గా ఇదే రీతిలో..
ఈ రోజు వరకు, మీరు అనేక వింత కేసుల గురించి చదివి లేదా విని ఉంటారు. వాటిల్లో కొన్ని మనల్ని ఆశ్చర్యానికి కూడా గురి చేస్తుంటాయి. ఇదే కోవకు చెందిన ఓ వింత కేసు మధ్యప్రదేశ్ పోలీసులను అవాక్కయ్యేలా చేసింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
”మా ఇల్లు ఎక్కడో పోయింది.. కనిపియలేదు” అని ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ సినిమాలో చిన్నారి చెప్పే డైలాగు మీకు గుర్తుండొచ్చు. సరిగ్గా ఇదే రీతిలో కొంతమంది గ్రామస్తులు ”మా ఊరిలో రోడ్డు పోయింది. రాత్రిపూట కనిపించకుండా మాయమైపోయింది” అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట ఆ కంప్లైంట్‌కు పోలీసులు ఆశ్చర్యపోయినా.. ఆ తర్వాత అసలు విషయాన్ని తెలుసుకుని.. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని అత్యంత వెనుకబడిన జిల్లాల్లో సిద్ది జిల్లా ఒకటి. ఆ జిల్లాలోని మంజోలి జనప్ పంచాయితీ పరిధిలో మేంద్ర అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో రోడ్డు వేసేందుకు 2017లో ప్రభుత్వం రూ. 10 లక్షలు మంజూరు చేసింది. అలాగే డబ్బు మంజూరు అయిన ఆరు నెలల్లోనే కొత్త రోడ్డు కూడా పూర్తయింది. మా గ్రామానికి కొత్త రోడ్డు వచ్చిందని గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.
అయితే ఇటీవల వచ్చిన ఎడతెరిపి లేని వర్షాలకు ఆ రోడ్డు కొట్టుకుపోయింది. ఆక్కడంతా బురద మయమైంది. దీనితో ఆగ్రహించిన గ్రామస్తులు.. కాంట్రాక్టరును నిలదీశారు. అతడు సరైన సమాధానం చెప్పాల్సింది పోయి.. వారితో దురుసుగా ప్రవర్తించాడు. దీనితో ఆ గ్రామ ప్రజలంతా కలిసి వెళ్లి మంజోలి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. తమ గ్రామానికి చెందిన రోడ్డు రాత్రి వరకు బాగానే ఉందని.. తెల్లారేసరికి మాయమైందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు మొదటి ఈ వింత కేసుకు ఆశ్చర్యపోయినా.. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్నారు. రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ల అవినీతి గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
Also Read:
రోజూ ఎన్ని బాదంపప్పులు తినాలి.? అతిగా తింటే ఏమవుతుంది.! ఈ విషయాలు తెలుసుకోండి
వామ్మో.. మొసలితో ఆ పిచ్చి గేమ్స్ ఏంటి అమ్మాయి.? వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఈ ఫ్యాన్సీ నెంబర్‌కు క్రేజ్ మాములుగా లేదు.. ఏకంగా రూ. 7.6 లక్షలకు అమ్ముడైంది.!