TV9 Global Summit: జూన్ 17 నుంచి TV9 థాట్‌ ఫెస్ట్‌.. హాజరుకానున్న ముగ్గురు సీఎంలు.. 14 మంది కేంద్ర క్యాబినేట్‌ మంత్రులు..

| Edited By: Team Veegam

Jun 17, 2022 | 11:30 AM

TV9 Global Summit: జూన్ 17 నుంచి రెండు రోజుల పాటు TV9 నెట్‌వర్క్ నిర్వహిస్తున్న థాట్‌ ఫెస్ట్‌ ‘వాట్ ఇండియా థింక్స్(What India Thinks Today) – గ్లోబల్ సమ్మిట్’ కు 14 మంది కేంద్ర కేబినెట్ మంత్రులతో పాటు ముగ్గురు సీఎంలు హాజరుకానున్నారు.

TV9 Global Summit: జూన్ 17 నుంచి TV9 థాట్‌ ఫెస్ట్‌.. హాజరుకానున్న ముగ్గురు సీఎంలు.. 14 మంది కేంద్ర క్యాబినేట్‌ మంత్రులు..
Tv9 Global Summit
Follow us on

TV9 Global Summit: జూన్ 17 నుంచి రెండు రోజుల పాటు TV9 నెట్‌వర్క్ నిర్వహిస్తున్న థాట్‌ ఫెస్ట్‌ ‘వాట్ ఇండియా థింక్స్(What India Thinks Today) – గ్లోబల్ సమ్మిట్’ కు 14 మంది కేంద్ర కేబినెట్ మంత్రులతో పాటు ముగ్గురు సీఎంలు హాజరుకానున్నారు. ‘విశ్వ గురు: ఇంకెంత దూరంలో’ అనే థీమ్‌తో జరిగే ఈ ఈవెంట్‌కు న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌ వేదిక కానుంది. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‘సెక్యూరింగ్ ఇండియా: టుడే అండ్ టుమారో’ అనే అంశంపై కీలకోపన్యాసం చేయనున్నారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘న్యూ ఇండియా మేకింగ్’పై ప్రసంగించనున్నారు. వీరితో పాటు నితన్‌ గడ్కరీ, స్మృతి ఇరానీ, హర్దీప్ ఎస్ పూరి, జి కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, గజేంద్ర సింగ్ షెకావత్, ప్రహ్లాద్ జోషి, భూపేందర్ యాదవ్, మహేంద్ర పాండే, అనురాగ్ ఠాకూర్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై వివిధ విషయాలపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. టీవీ9 గ్రూప్ నిర్వహిస్తోన్న ఈ మొదటి గ్లోబల్ సింపోజియమ్‌లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మేఘాలయ సీఎం కాన్రాడ్ కె సంగ్మా, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పాల్గొననున్నారు. అదేవిధంగా UK మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్, ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తో సహా 75 మంది స్టార్ స్పీకర్లు ఈ సమ్మిట్‌కు హాజరుకానున్నారు. ‘ఇండియా ఇన్ ది న్యూ ఇంటర్నేషనల్ ఆర్డర్” అనే విషయంపై డేవిడ్ కామెరూన్ ప్రసంగించనుండగా.. హమీద్ కర్జాయ్ ‘టెర్రరిజం: ఎనిమీ ఆఫ్ హ్యుమానిటీ’ అనే అంశంపై ప్రసంగించనున్నారు.

ఈ సమ్మిట్‌లో ప్రధానంగా రాజకీయాలు, గవర్నెన్స్, ఎకనమిక్స్, ఆరోగ్య సంరక్షణ, సంస్కృతి, క్రీడల రంగాలకు చెందిన అంశాలపై చర్చ జరగనుంది. ఇందుకోసం అత్యంత ప్రభావవంతమైన, విశిష్ట అంతర్జాతీయ, జాతీయ స్థాయి వక్తలను ఒకే వేదికపైకి తీసుకువస్తోంది. ఇది రెండు రోజుల పాటు 75 మంది స్టార్ స్పీకర్లకు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు TV9 నెట్‌వర్క్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అవకాశాలు, ప్రతికూల సమయాల్లో భారత్ కొత్త ప్రపంచ క్రమాన్ని ఎలా విజయవంతంగా ఎదుర్కొంది అనే దానిపై చర్చలు జరుగనున్నట్లు TV9 పేర్కొంది. కాగా విశ్వగురువుగా ఎదిగేందుకు భారత్ చేస్తున్న ప్రయాణానికి సంబంధించిన బ్లూప్రింట్‌పై ఈ థింక్-ఫెస్ట్ నిర్వహించబడుతోందని TV9 CEO బరున్ దాస్ పేర్కొన్నారు. భారతదేశ ప్రయాణం సవాళ్లు లేనిది కాదని, కానీ.. లక్ష్యం అంతకంటే పవిత్రమైనదని బరున్ దాస్ అన్నారు. ప్రతిష్ఠాత్మకమైన, బలమైన నాయకత్వం, సమష్ఠి సంకల్పం మొత్తం దేశాన్ని నిబద్ధతతో నడుపబడుతోందని వ్యాఖ్యానించారు. భారతదేశం ‘విశ్వ గురువు’గా మారాలనే ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి స్వేచ్ఛా వాతావరణంలోని చర్చల ద్వారా ఆలోచనలను రూపొందించడమే.. ఈ ఈవెంట్ అంతిమ లక్ష్యమని దాస్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

India Corona: దేశంలో కరోనా డేంజర్‌ బెల్స్‌.. మళ్లీ భారీగా పెరిగిన కొత్త కేసులు.. మూడు నెలల తర్వాత ఇవే అత్యధికం..

Health Tips For Eyes: కంటి చూపు మెరుగుపర్చుకోవాలంటే వీటిని డైట్‌లో చేర్చుకోవాల్సిందే..

Home Remedies: సీజనల్‌ మార్పులతో జలుబు, దగ్గు వేధిస్తున్నాయా? అయితే ఈ సింపుల్ చిట్కాలతో ఉపశమనం పొందండి..