Viral News: నమ్మలేని నిజం.. 25 ఏళ్లుగా ఒకే ఫ్యామిలీలోని 12మందిని ఒకే ప్లేస్ లో కాటేసిన పాములు.. ఐదుగురు మృతి

ధర్మణ్ణ ఉమ్మడి కుటుంబంలో ఇప్పటి వరకూ 12 మంది పాము కాటుకు గురయ్యారు. వీరిలో ఐదుగురు మరణించారు. మృతులంతా పురుషులే కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Viral News: నమ్మలేని నిజం.. 25 ఏళ్లుగా ఒకే ఫ్యామిలీలోని 12మందిని ఒకే ప్లేస్ లో కాటేసిన పాములు.. ఐదుగురు మృతి
Snakes Bitten
Follow us

|

Updated on: Aug 25, 2022 | 1:19 PM

Viral News: నాగుపాములు పగబడతాయని హిందువుల నమ్మకం.. పాము పగబట్టడం అంతా ఒట్టి ట్రాష్ అంటూ హేతువాదులు, శాస్త్రవేత్తలు కొట్టివేస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సంఘటనలు పాము పగ పడతాయి అన్న మాట నిజమేనేమో అనిపిస్తాయి. తాజాగా ఓ కుటుంబాన్ని పాములు గత కొంతకాలంగా వెంటాడుతున్నాయి. అది కూడా ప్రతి నాలుగైదేళ్లకు ఒకసారి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ను వెంటాడి వేటాడి కాటు వేస్తున్నాయి. ఇప్పటికి 12 మందిని కాటు వేయగా.. వారిలో కొంతమంది మరణించారు. ఈ వింత సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

రాష్ట్రంలోని తుమకూరు జిల్లా తొగరిఘట్ట గ్రామంలో ధర్మణ్ణ ఉమ్మడి కుటుంబం నివసిస్తుంది. ఈ కుటుంబంలోని సభ్యులోని ఎవరొకరిని  ప్రతి నాలుగైదేళ్లకు ఒకసారి పాము కాటు వేస్తుంది. ఇలా గత 25 ఏళ్లనుంచి జరుగుతుంది. ధర్మణ్ణ ఉమ్మడి కుటుంబంలో ఇప్పటి వరకూ 12 మంది పాము కాటుకు గురయ్యారు. వీరిలో ఐదుగురు మరణించారు. మృతులంతా పురుషులే కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గతంలో కుటుంబ పెద్ద ధర్మణ్ణ తో పాటు హనుమంతప్ప, వెంకటేశ్, శ్రీనివాస్ లు మరణించగా.. ఇటీవల గోవిందరాజు మృతి చెందాడు.  అయితే మరణించిన వారంతా ఒకే ప్లేస్ లో పాము కాటుకు గురికావడం విచిత్రంగా పేర్కొంటున్నారు.

తాజాగా ఆగస్టు 15న గోవిందరాజు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి పాముకాటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మరణించాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు, పొలంలో పనిచేసే కూలీలు కూడా భయబ్రాంతులకు గురవుతున్నారు. పొలం వైపు వెళ్లడం మానేశారు. పాము శాంతించాలని రాహు, కేతువుల పూజలు చేసినా ఫలితం లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మృతుడు గోవిందరాజు భార్య కమలమ్మ  మాట్లాడుతూ.. తమ కుటుంబంలో తరచుగా పాము కాటు, మరణాల సంఘటనలతో  భయాందోళనలు నెలకొన్నాయని.. తమ సమస్యకు ఎవరైనా పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.

తన పొలం వద్ద ఉన్న ఒక పెద్ద చెట్టును ధర్మణ్ణ ఒక రోజు నరికివేశాడని.. ఆ చెట్టు శాపమే తమ కుటుంబ సభ్యులు పాము కాటు.. మరణాలని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ చెట్టు కాలక్రమంలో చిగురించింది. అయినపప్టికీ అప్పటి నుంచి ఈ ఫ్యామిలీ సభ్యుల్లో ఎవరొకరు పాము కాటుకు గురవుతూనే ఉన్నారు. పాము పగ పోవాలని గ్రామస్తులు స్థానిక మునియప్ప ఆలయంలో నిత్య పూజలు జరిపిస్తున్నారు.

(ఈ వార్తను పాఠకుల ఆసక్తిని పరిగణలోకి తీసుకుని ప్రచురించడం జరిగింది. పాములు పగబడతాయనడానికి ఎటువంటిని శాస్త్రీయ ఆ ధరాలు లేవు. టీవీ9 తెలుగు ఈ విషయాన్నీ  పాములు పగబడతాయని ధ్రువీకరించడం లేదు)

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు