India Corona Updates: దేశ వ్యాప్తంగా కొత్తగా 11వేల కరోనా కేసులు నమోదు.. ఒక్కరోజులో 90 మంది మృతి..
India Corona Updates: భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,649 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
India Corona Updates: భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,649 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అయితే, కరోనా కారణంగా ఆదివారం సాయంత్రానికి 90 మంది మృత్యువాత పడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,09,16,589 కి చేరింది. 1,06,21,220 మంది కరోనాను జయించారు. ఇదే సమయంలో కరోనా మృతు సంఖ్య 1,55,732కి చేరింది. అయితే, గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాకపోవడం శుభపరిణామంగా చెప్పవచ్చు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,39,637 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 82,85,295 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
Also read: