Road Accident: యమపాశంలా దూసుకొచ్చిన కంటైనర్.. 10 మంది దుర్మరణం.. 20 మందికి పైగా..
Dhule Road Accident: మహారాష్ట్రలోని ధూలేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ భారీ కంటైనర్ బీభత్సం సృష్టించింది. కంటైనర్ రోడ్డుపై ఉన్న వాహనాలను వరుసగా ఢీకొడుతూ దూసుకెళ్లింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు.
Dhule Road Accident: మహారాష్ట్రలోని ధూలేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ భారీ కంటైనర్ బీభత్సం సృష్టించింది. కంటైనర్ రోడ్డుపై ఉన్న వాహనాలను వరుసగా ఢీకొడుతూ దూసుకెళ్లింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్లు అధికార వర్గాలు తెలిపాయి. గాయపడ్డ వాళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ధూలేలోని పలస్‌నార్ గ్రామం దగ్గర్లో హైవేపై వెళ్తున్న కంటైనర్.. నాలుగు వాహనాలను ఢీకొని, ఆపై ఒక హోటల్‌లోకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో 10 మంది మరణించగా.. 20 నుంచి 30 మంది వరకు పైగా గాయపడ్డట్లు పోలీసులు వెల్లడించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. ధులేలోని ముంబై-ఆగ్రా హైవేపై పలాస్నేర్ గ్రామ సమీపంలో ఉదయం 10.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి తెలిపారు.
ట్రక్కు బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో దాని డ్రైవర్ చక్రాలపై నియంత్రణ కోల్పోయాడని.. ఆ తర్వాత ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. కంటైనర్ రెండు మోటార్‌సైకిళ్లు, కారు, మరో కంటైనర్‌ను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ట్రక్కు హైవేపై బస్టాప్ సమీపంలో ఉన్న హోటల్‌పైకి దూసుకెళ్లి బోల్తా పడిందన్నారు. ట్రక్కు మధ్యప్రదేశ్ నుంచి ధులే వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని.. బాధితుల్లో స్టాప్‌లో బస్సు కోసం వేచి ఉన్న వారు సైతం ఉన్నారని అధికారులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను శిర్పూర్, ధూలేలోని ఆసుపత్రులకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..