Gujarat: పోయినా కాటేస్తున్న కరోనా.. గర్బా వేడుకల్లో చావు కేకలు.. డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి పది మంది మృతి..

Garba Events Deaths: గర్బా ఆటపాటల్లో చావు కేక వినిపిస్తోంది. గుజరాత్‌ వ్యాప్తంగా యూత్‌ ఓవైపు గర్బా డ్యాన్సులతో హోరెత్తిస్తుంటే మరోవైపు మరణమృదంగం మోగుతోంది. గర్బా డ్యాన్స్‌ చేస్తూ.. 24 గంటల్లో పదిమంది చనిపోయారు. పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా మృత్యువాత పడడం అందరిని షాక్‌కు గురి చేస్తోంది. కోవిడ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌ ఇంకా వెంటాడుతున్నాయా?

Gujarat: పోయినా కాటేస్తున్న కరోనా.. గర్బా వేడుకల్లో చావు కేకలు.. డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి పది మంది మృతి..
Garba Event
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 22, 2023 | 9:03 PM

Garba Events Deaths: నవరాత్రి గర్బా నృత్యాలతో గుజరాత్‌ హోరెత్తిపోతోంది. ఊరు వాడ గర్బా డ్యాన్సులతో మోతెక్కిపోతున్నాయి. పిల్లాపెద్దా యువతీయువకులు గర్బాతో దసరా సరదాను రెట్టింపు చేస్తున్నారు. గర్బా మేనియాతో గుజరాత్‌ ఊగిపోతోంది. ఇలాంటి గర్బా ఆటపాటల్లో ఇప్పుడు చావు కేక కలవరం పుట్టిస్తోంది. నవరాత్రి ఉత్సవాల్లో గర్బా నృత్యం చేస్తూ 10 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. గత 24 గంటల్లో పది మంది గర్భా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మరణించడం కలకలం రేపింది. బాధితుల్లో టీనేజర్ల నుంచి మధ్య వయస్కుల వరకు ఉన్నారు. వారిలో చిన్నవాడు బరోడాలోని దభోయ్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు. అహ్మదాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు గర్బా ఆడుతూ హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. అలాగే కపద్వాంజ్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు కూడా గర్బా ఆడుతూ చనిపోయాడు. రాష్ట్రంలో ఇలాంటి కేసులు 10 వరుసగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

శ్వాస సంబంధిత.. గుండె సంబంధిత సమస్యలు

నవరాత్రులు ప్రారంభమైన తొలి ఆరు రోజుల్లోనే ఊపిరి ఆడడం లేదంటూ అంబులెన్స్‌ సర్వీసులకు 690 కాల్స్‌ వచ్చాయి. ఇక గుండె సంబంధిత సమస్యలపై 521 కాల్స్ వచ్చాయి. దీంతో ఈవెంట్ నిర్వాహకులు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. గర్భా వేదికల సమీపంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్స్ సెంటర్స్ అప్రమత్తంగా వుండాలని గుజరాత్ ప్రభుత్వం ఆదేశించింది.

కరోనా తర్వాత పెరుగుతున్న గుండెపోటు కేసులు..

కరోనా తర్వాత దేశంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. మాట్లాడుతూ.. ఆటలాడుతూ.. పనిచేస్తూ కూర్చొన్న మనిషి కూర్చొన్న చోటే కుప్పకూలిపోతున్నాడు. ముఖ్యంగా 30 ఏళ్ల లోపు యువత ఎక్కువగా గుండెపోటుతో మరణిస్తూ ఉండటంతో నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గుజరాత్‌లో గర్బా వేడుకల్లో 10 మంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం.. పోస్ట్‌ కోవిడ్‌ ఎఫెక్ట్‌ కావొచ్చంటున్నారు డాక్టర్లు.

కరోనా పోయినా.. దాని ప్రభావం ఇంకా ఉందంటున్నారు వైద్య నిపుణులు. కోవిడ్‌ సమయంలో ఎక్కువగా ఎఫెక్ట్‌ అయినవాళ్లు… ఆ తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వాళ్లు. అయితే, గర్భా వేడుకల్లో  పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా మృత్యువాత పడడం అందరిని షాక్‌కు గురి చేస్తోంది. కోవిడ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌ ఇంకా వెంటాడుతున్నాయా? అంటూ పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..