Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో లుకలుకలు.. సీఎం సిద్ధూను గద్దె దింపేందుకు మంత్రుల పావులు
Karnataka Political Drama: కర్నాటక ఎన్నికల తంతు ముగిసింది.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది. సీఎంగా సిద్ధరామయ్య సర్కార్ పాలన కొనసాగిస్తోంది. అంతేకాదు.. కర్నాటక గెలుపు తర్వాత తెలంగాణలోనూ కాంగ్రెస్‌కు మాంచి ఊపొచ్చింది. అదే స్పీడ్‌తో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తోంది టీకాంగ్రెస్. సరిగ్గా ఇలాంటి సమయంలో ఓ పిడుగుపాటు టీకాంగ్రెస్ శ్రేణులను కలవరపాటు గురిచేస్తోంది. చింత చచ్చినా పులుపు చావదన్నట్టు కాంగ్రెస్‌లో మార్పు కష్టమని మరోసారి రుజువవుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయినా గడవక ముందే అసమ్మతి రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలు పీక్ స్టేజ్‌కు చేరాయి.

కర్ణాటక కాంగ్రెస్‌లో లుకలుకలు షురూ అయ్యాయి. సీఎం సిద్ధరామయ్యను గద్దె దింపేందుకు మంత్రులు పావులు కదుపుతున్నారన్న ప్రచారం కలకలం రేపుతోంది. కర్నాటక.. కర్నాటక.. కర్నాటక.. ఇదీ దాదాపు ఐదారు నెలలు నుంచి రాజకీయంగా మోత మోగిపోతున్న పేరు.. అయితే.. కర్నాటక ఎన్నికల తంతు ముగిసింది.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది. సీఎంగా సిద్ధరామయ్య సర్కార్ పాలన కొనసాగిస్తోంది. అంతేకాదు.. కర్నాటక గెలుపు తర్వాత తెలంగాణలోనూ కాంగ్రెస్‌కు మాంచి ఊపొచ్చింది.
అదే స్పీడ్‌తో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తోంది టీకాంగ్రెస్. సరిగ్గా ఇలాంటి సమయంలో ఓ పిడుగుపాటు టీకాంగ్రెస్ శ్రేణులను కలవరపాటు గురిచేస్తోంది. చింత చచ్చినా పులుపు చావదన్నట్టు కాంగ్రెస్‌లో మార్పు కష్టమని మరోసారి రుజువవుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయినా గడవక ముందే అసమ్మతి రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలు పీక్ స్టేజ్‌కు చేరాయి. సీఎం సీట్లో మరో వ్యక్తిని కూర్చబెట్టే ప్రయత్నాలు జోరందుకున్నాయి. సీఎం సిద్ధరామయ్యను గద్దెదింపడానికే స్వయంగా ఆయన మంత్రివర్గ సహచరులే పావులు కదపడంతో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
సీఎం సిద్ధరామయ్యను గద్దె దింపేందుకు మంత్రి సతీశ్ జార్ఖిహోలి నేతృత్వంలో 20 మంది ఎమ్మెల్యేలతో క్యాంప్ ఏర్పాటు చేసిందనే టాక్ కాంగ్రెస్ పార్టీలో కంగారు పుట్టించింది. దాంతో.. కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగింది. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా హుటాహూటిగా బెంగళూరుకు చేరుకొని మంత్రి జార్ఖిహోళితో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ మంచిదికాదంటూ నచ్చజెప్పినట్లు ఆ పార్టీ వర్గాల్లోనే ప్రచారం నడుస్తోంది.
ఇక.. అటు సిద్ధరామయ్య, ఇటు డీకే వర్గాలకు దూరంగా ఉండే మరో వర్గం తాము ఎందుకు సీఎం కావద్దనే ఆలోచనలతో క్యాంప్ రాజకీయాలు మొదలెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. మొత్తంగా.. మూడు వర్గాల కర్నాటక కాంగ్రెస్ పాలిటిక్స్ ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి