COVID Vaccine Second Dose: రెండో డోస్ వ్యాక్సిన్ వేసుకోలేదా? అయితే మీకో షాకింగ్ న్యూస్.. ఈ విషయాలను తెలుసుకోండి..!

17 రాష్ట్రాల్లో మొత్తం 10.34 కోట్ల మంది రెండవ డోస్ వ్యాక్సిన్ వేసుకోలేదు. అంటే, రెండవ డోస్ తేదీ దాటిన తర్వాత కూడా వీరంతా పలు కారణాలతో డోస్ తీసుకోలేదు. భారతదేశంలో కోవిషీల్డ్ రెండు మోతాదుల మధ్య గ్యాప్..

COVID Vaccine Second Dose: రెండో డోస్ వ్యాక్సిన్ వేసుకోలేదా? అయితే మీకో షాకింగ్ న్యూస్.. ఈ విషయాలను తెలుసుకోండి..!
Covid Vaccine
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 22, 2021 | 12:38 PM

COVID Vaccine Second Dose: మొదటి డోస్ తీసుకున్న తరువాత చాలా మంది పలు కారణాలతో రెండవ డోస్ వ్యాక్సిన్ తీసుకోలేదు. దేశ వ్యాప్తంగా రెండవ డోస్ వ్యాక్సిన్ తీసుకోని వారు 100 మిలియన్ల మంది ఉన్నారు. ఇది ప్రస్తుతం ఆందోళన కలిగించే అంశంగా మారింది. అటువంటి వ్యక్తుల సమాచారాన్ని సేకరించి, త్వరగా రెండవ డోస్ ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ప్రభుత్వం కోరింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అటువంటి వ్యక్తులు టీకా కవరేజీలో ప్రధాన అడ్డంకిగా మారడంతోపాటు రోగనిరోధక శక్తిని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని అంటున్నారు.

రెండవ మోతాదు తీసుకోని వ్యక్తుల సంఖ్య 10.34 కోట్లు.. డేటా ప్రకారం, 17 రాష్ట్రాల్లో మొత్తం 10.34 కోట్ల మందికి రెండవ డోస్ వ్యాక్సిన్ వేసుకోలేదు. అంటే, రెండవ డోస్ తేదీ దాటిన తర్వాత కూడా వీరంతా పలు కారణాలతో డోస్ తీసుకోలేదు. భారతదేశంలో కోవిషీల్డ్ రెండు మోతాదుల మధ్య గ్యాప్ 12-16 వారాలే ఉంది. అదే సమయంలో, కోవాక్సిన్ రెండు మోతాదులు 4-6 వారాల వ్యవధిలో ఇస్తున్న సంగతి తెలిసిందే.

10.34 కోట్ల మందిలో దాదాపు 3.92 కోట్ల మందికి రెండవ డోస్ తేదీ దాటి 6 వారాల కంటే ఎక్కువే అయింది. 4-6 వారాలలోపు డోస్ మిస్ అయిన వారు 1.57 కోట్లు కాగా, 2-4 వారాలుగా డోస్ మిస్ అయిన వారు దాదాపు 1.50 కోట్ల మంది ఉన్నారు.

ఏ రాష్ట్రంలో, ఎంత మందికి రెండవ డోస్ వేయలేదు? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో రెండవ డోస్ మిస్ అయినవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. రెండవ డోస్ మిస్ అయిన మొత్తం వ్యక్తులలో 35% మంది ఈ మూడు రాష్ట్రాలకు చెందిన వారే కావడం గమనార్హం.

రెండు మోతాదులను తీసుకోవడం ముఖ్యమా? నిపుణుల మేరకు, వ్యాక్సిన్ రెండు మోతాదులను తీసుకుంటేనే పూర్తి రక్షణ ఉంటుందని పేర్కొంటున్నారు. అలాగే, టీకా మొదటి మోతాదు ప్రతిరోధకాలను తయారు చేయడానికి శరీరాన్ని సిద్ధం చేస్తుంది. రెండవ మోతాదు శరీరంలో తగినంత సంఖ్యలో ప్రతిరోధకాలను సృష్టిస్తుంది. ఇది చాలా కాలం పాటు శరీరంలో ఉంటుంది. కాబట్టి టీకా ఒక మోతాదు సరిపోదు. రెండు టీకాలు వేసే వరకు పూర్తి రక్షణ లభించదు. అందుకే మీరు టీకా యొక్క రెండు మోతాదులను తీసుకోవడం చాలా ముఖ్యం.

టీకా ఒక మోతాదు తగినంత రోగనిరోధక శక్తిని ఇస్తుందా? చాలా వ్యాక్సిన్‌లకు ఒక మోతాదు తీసుకుంటే అంత సమర్థతంగా పనిచేయవు. అంటే ఒక మోతాదు ఎంత ప్రభావవంతంగా ఉంటుందో తెలిపేందుకు ఎటువంటి పరీక్షలు చేయలేదు. అందుకే ఒక్క డోస్ వ్యాక్సిన్ ఎంత ప్రభావవంతంగా ఉంటుందో మనకు తెలియదు. అయితే, CoveShield ఒక మోతాదుపై చేసిన ఒక అధ్యయనంలో కొంతవరకే రక్షణను అందిస్తుందని తేలింది. అయితే దాని ప్రభావం చాలా త్వరగా తగ్గిపోతుంది. అందువల్ల, టీకా రెండు మోతాదులను తీసుకోవడంతోనే మనకు తగినంత రోగనిరోధక శక్తిని పొందవచ్చు.

రెండో డోస్ మిస్ అయిన వారి పరిస్థితి? ఇలాంటి వారికి మళ్లీ మొదటి డోస్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అవకాశం ఉన్నప్పుడు మరొక మోతాదు తీసుకోవచ్చు.

డోస్ మిస్ అయితే యాంటీబాడీస్ తగ్గుతాయా, అలాంటి వారికి బూస్టర్ డోస్ వేస్తారా? ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని వ్యాక్సిన్‌లపై పరిశోధనలు జరిగాయి. కాలక్రమేణా యాంటీబాడీలు తగ్గుముఖం పడతాయని ఈ పరిశోధనల్లో వెల్లడైంది. మన శరీరంలో యాంటీబాడీలు తక్కువగా ఉన్నప్పటికీ, తీవ్రమైన అనారోగ్యం, ఆసుపత్రిలో చేరడం, కరోనా కారణంగా మరణం నుంచి మనలను రక్షించడంలో అవి ఇప్పటికీ ప్రభావవంతంగా ఉంటాయి. అందువల్ల, ప్రస్తుతం, బూస్టర్ మోతాదు సిఫార్సు చేయడం లేదు. కానీ, భవిష్యత్తులో బూస్టర్ మోతాదు అవసరం కావచ్చు.

ఒక మోతాదు మాత్రమే తీసుకుంటే ఏం జరుగుతుంది? కోవాక్సిన్ వంటి కొన్ని టీకాలు ఒకే మోతాదు నుంచి ఎటువంటి రక్షణను అందించవు. అలాంటి వారు మరొక మోతాదు తీసుకోకపోతే, దాదాపుగా టీకాలు వేయని వ్యక్తులతో సమానంగా ఉంటారు. అంటే, ఒక మోతాదుతో ఎటువంటి ఉపయోగం ఉండదు. అందుకే రెండవ మోతాదు తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు టీకా ఒక మోతాదు మాత్రమే తీసుకుంటే, యాంటీబాడీ స్థాయిలలో వ్యత్యాసం ఎక్కువగా ఉండదు. 5 నుంచి 6 నెలల తర్వాత, మీ యాంటీబాడీ స్థాయి టీకాలు వేయని వ్యక్తులతో సమానంగా ఉంటుంది.

ఇది మూడవ వేవ్ ప్రమాదాన్ని పెంచుతుందా? వ్యాధి సోకిన వ్యక్తులను తీవ్రమైన అనారోగ్యం, ఆసుపత్రిలో చేరడం, మరణం నుంచి రక్షించడం టీకా ప్రధాన పాత్ర. మూడవ వేవ్‌ను నివారించడానికి, టీకాతో పాటు, కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటించడం కూడా అవసరం. అలాగే, మూడవ వేవ్ ఉంటే, అప్పుడు టీకాలు వేయని వ్యక్తులు తీవ్రమైన వ్యాధికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. అదే సమయంలో, టీకాలు వేసిన వ్యక్తులకు ఈ ప్రమాదం తక్కువగా ఉంటుంది. అలాగే, కరోనా దేశం నుంచి పారిపోయిందని అస్సలు భావించుకోవద్దు. ఇప్పటి వరకు టీకాలు తీసుకోని వారు లేదా రెండవ డోస్ తీసుకోని వారు వీలైనంత త్వరగా టీకాలు తీసుకోవడం మంచిది.

Also Read: Indian Army: 15వేల అడుగల ఎత్తైన హిమగిరుల్లో రెపరెపలాడిన జాతీయ జెండా.. వీడియో షేర్ చేసిన ఇండియన్ ఆర్మీ..

Joint Bank Account: పెన్షన్ కోసం ఉమ్మడి ఖాతా తెరవడం తప్పనిసరి కాదు.. స్పష్టం చేసిన కేంద్రం..