Motorcyclist Fined: దిమ్మదిరిగే షాకిచ్చిన అధికారులు.. ద్విచక్ర వాహనదారుడికి రూ.1.13 లక్షల జరిమానా

Motorcyclist Fined: వాహనదారులు కనీస జాగ్రత్తలు పాటించకుండా, వాహనానికి సంబంధించి పత్రాలు లేకపోవడంతో ట్రాఫిక్‌ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు....

Motorcyclist Fined: దిమ్మదిరిగే షాకిచ్చిన అధికారులు.. ద్విచక్ర వాహనదారుడికి రూ.1.13 లక్షల జరిమానా
Follow us

| Edited By: Team Veegam

Updated on: Jan 14, 2021 | 4:18 PM

Motorcyclist Fined: వాహనదారులు కనీస జాగ్రత్తలు పాటించకుండా, వాహనానికి సంబంధించి పత్రాలు లేకపోవడంతో ట్రాఫిక్‌ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. వాహనానికి సంబంధించి అన్ని పత్రాలు కలిగి ఉండాలని పోలీసులు పదేపదే చెబుతున్నా.. కొందరు పెడచెవిన పెడుతుండటంతో పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. అయితే నిబంధనలు ఉల్లంఘించిన తీరును బట్టి అధికారులు జరిమానా వేస్తున్నారు. తాజాగా ఓ ద్విచక్ర వాహనదారుడికి భారీగా జరిమానా విధించారు. వాహనానికి రిజిస్ట్రేషన్‌ చేయించకుండా కనీసం హెల్మెట్‌ కూడా ధరించని ఓ వ్యాపారికి అధికారులు ఏకంగా రూ.1.13 లక్షల జరిమానా విధించారు..

ఒడిశాలోని రాయగడ డీవీఐ కూడలి వద్ద బుధవారం పోలీసులు, ఆర్టీవో సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ప్లాస్టిక్‌ డ్రమ్ముల వ్యాపారం చేసే మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రకాశ్‌ బంజార అనే వ్యక్తిని ఆపారు. అతడు తన వాహనానికి 8 డ్రమ్ములు కట్టుకుని వెళ్తున్నాడు. దీంతో అధికారులు వాహనానికి సంబంధించిన పత్రాలు అడుగగా, ప్రకాశ్ ఏవి కూడా చూపించలేకపోయాడు. ఈ తనిఖీలో వాహనానికి రిజిస్ట్రేషన్‌ కూడా చేయించలేదని, ఏ విధమైన పత్రాలు కూడా ఆయన తగ్గర లేవని గుర్తించారు. అయితే రిజిస్ట్రెషన్‌ లేకుండా వాహనం ఉపయోగించినందుకు అతనికి రూ. 5వేలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేనందుకు రూ.5 వేలు, వాహనానికి ఇన్స్‌రెన్స్‌ లేనందుకు రూ.2 వేలు, హెల్మెట్‌ ధరించనందుకు రూ.1000, అలాగే CH-VII 182-A1 ను ఉల్లంఘించినందుకు రూ. లక్ష చొప్పున మొత్తం రూ.1.13 లక్షల జరిమానా విధించారు.

దీంతో అధికారులు భారీ మొత్తంలో జరిమానా విధించారు. ప్రకాశ్‌ అప్పటికప్పుడు తన స్నేహితుల వద్ద నుంచి డబ్బు తీసుకుని జరిమానా మొత్తాన్ని చెల్లించాడు. ఇలా ఎన్ని రోజులు తప్పించుకుని తిరిగినా చివరకు ఏదో ఒక సమయంలో పట్టుబడక తప్పదు.

Bowenpally Kidnap Case: అఖిలప్రియను న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చిన పోలీసులు.. 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌