Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుప్రీంకోర్టు కమిటీ నుంచి వైదొలగిన సభ్యుడు భూపేందర్ సింగ్ మాన్, తానూ రైతునేనని ప్రకటన, మరో కొత్త మలుపు

రైతుల సమస్యపై చర్చించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ నుంచి మాజీ ఎంపీ, బీకేయూ జతీయ అధ్యక్షుడు భూపేందర్ సింగ్ మాన్ వైదొలిగారు.

సుప్రీంకోర్టు కమిటీ నుంచి వైదొలగిన  సభ్యుడు భూపేందర్ సింగ్ మాన్, తానూ రైతునేనని ప్రకటన, మరో  కొత్త మలుపు
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jan 14, 2021 | 3:50 PM

రైతుల సమస్యపై చర్చించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ నుంచి మాజీ ఎంపీ, బీకేయూ జతీయ అధ్యక్షుడు భూపేందర్ సింగ్ మాన్ వైదొలిగారు. మొత్తం నలుగురు సభ్యులతో కమిటీని కోర్టు ఏర్పాటు చేసింది. వారిలో ఒకరైన భూపేందర్ సింగ్.. ఈ పానెల్ నుంచి వైదొలిగారని భారతీయ కిసాన్ యూనియన్ వెల్లడించింది.  ఈమేరకు ఆయన జారీ చేసినట్టు చెబుతున్న స్టేట్ మెంట్ ను ఈ సంఘం విడుదల చేసింది. తనను ఈ పానెల్ లో సభ్యునిగా నియమించినందుకు కృతజ్ఞుడినని, కానీ స్వతహాగా తాను కూడా రైతునే అని, వారి సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకుని ఈ కమిటీ నుంచి తప్పుకుంటున్నానని మాన్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు. పంజాబ్ తో బాటు ఈ దేశ అన్నదాతల ప్రయోజనాలపై రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు.

అయితే ఈ స్టేట్ మెంట్ కింద మాన్ సంతకం లేదు. మరి ఇది బీకేయూ కావాలని విడుదల చేసిందా అన్నది అర్థం కావడంలేదంటున్నారు. . అసలు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీనే తాము తిరస్కరిస్తున్నట్టు రైతులు ఇదివరకే స్పష్టం చేశారు. ఈ కమిటీ పూర్తిగా రైతు చట్టాలకు, ప్రభుత్వానికి అనుకూలమని వారు ఆరోపించారు. ఈ పానెల్ తో మేము చర్చించే ప్రసక్తి లేదని కరాఖండిగా పేర్కొన్నారు. అటు-జనవరి 26 న రైతులు నిర్వహించే ట్రాక్టర్ ర్యాలీపై అనిశ్చితి నెలకొంది. బీకేయూ లో ఈ విషయమై విభేదాలు తలెత్తినట్టు కనిపిస్తోంది. ఒకరు పరేడ్ జరిగే స్థలానికి ర్యాలీ నిర్వహిస్తామని అంటే మరొకరు ఢిల్లీ సరిహద్దుల్లోనే ట్రాక్టర్లతో నిరసన వ్యక్తం చేస్తామని అంటున్నారు. 20 వేల ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తామని ఇదివరకే రైతు సంఘాలు పేర్కొన్నాయి. Read Also:Bharat Bandh: భారత్ బంద్ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు, వాటికి మాత్రమే మినహాయింపు. Read Also:రైతుల్లో అపోహలు కల్పిస్తున్నారు, బీజేపీపై కాంగ్రెస్ ఫైర్, మేం అన్నదాతలపక్షమే !