Mohammed Azharuddeen Century: ”వావ్ అజహరుద్దీన్.. నువ్వు గ్రేట్” పొగడ్తలతో ముంచెత్తిన సెహ్వాగ్..
Mohammed Azharuddeen Century: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కేరళకు చెందిన యువ బ్యాట్స్‌మెన్ మహ్మద్ అజహరుద్దీన్ విధ్వంసం సృష్టించాడు.

Mohammed Azharuddeen Century: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కేరళకు చెందిన యువ బ్యాట్స్‌మెన్ మహ్మద్ అజహరుద్దీన్ విధ్వంసం సృష్టించాడు. బుధవారం ముంబయితో జరిగిన మ్యాచ్‌లో 37 బంతుల్లోనే సెంచరీ సాధించి పొట్టి క్రికెట్‌లో భారత్ తరపున రెండో వేగవంతమైన శతకాన్ని నమోదు చేసుకున్నాడు. దీనితో మాజీ క్రికెటర్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.
”వావ్ అజహరుద్దీన్. గొప్ప ఇన్నింగ్స్ ఆడావ్. గ్రేట్. ముంబయి లాంటి అద్భుతమైన జట్టుపై ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం సాధారణ విషయం కాదు. నీ ఇన్నింగ్స్‌ను పూర్తిగా ఆస్వాదించాను” అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో అజహరుద్దీన్ 54 బంతుల్లో 137 పరుగులు(9 ఫోర్లు, 11 సిక్స్‌లు) చేసి నాటౌట్‌గా నిలవడమే కాకుండా తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.
Wah Azharudeen , behtareen !
To score like that against Mumbai was some effort. 137* of 54 and finishing the job on hand. Enjoyed this innings.#SyedMushtaqAliT20 pic.twitter.com/VrQk5v8PPB
— Virender Sehwag (@virendersehwag) January 13, 2021
1⃣st ? for a Kerala batsman in T20s ? 2⃣nd fastest ton in #SyedMushtaqAliT20‘s history ? 3⃣rd joint-fastest T20 hundred by an Indian batsman ?
9⃣ fours, 1⃣1⃣ sixes & 1⃣3⃣7⃣* off 5⃣4⃣!
Watch Mohammed Azharuddeen’s dominating hundred ?? #KERvMUM https://t.co/72DX7UDadJ pic.twitter.com/9dbAIEq4gT
— BCCI Domestic (@BCCIdomestic) January 13, 2021