AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multibagger Stocks: లక్ష పెట్టుబడి రూ. 2.5 కోట్లు.. 3 నెలల్లోనే అధిక లాభాలిచ్చిన మల్టీబ్యాగర్ స్టాక్ ఏదంటే?

గత 3 నెలల్లో ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ రూ. 0.35 నుంచి రూ. 87.45 వరకు పెరిగింది. ఈ స్వల్ప వ్యవధిలో ఈ పెన్నీ స్టాక్స్ దాదాపు 24,900 శాతం లాభం అందించింది.

Multibagger Stocks: లక్ష పెట్టుబడి రూ. 2.5 కోట్లు.. 3 నెలల్లోనే అధిక లాభాలిచ్చిన మల్టీబ్యాగర్ స్టాక్ ఏదంటే?
Money
Venkata Chari
|

Updated on: Jan 23, 2022 | 7:23 AM

Share

Multibagger Stock Tips: పెన్నీ స్టాక్‌ల(Multibagger Stock)లో డబ్బును పెట్టుబడి పెట్టడం చాలా ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే అవి చాలా అస్థిరంగా ఉంటాయి. కానీ, ‘కొనుగోలు చేయండి, అమ్మండి, మరచిపోండి’ అనే విధానాన్ని నమ్మే స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు మాత్రం కొన్ని స్టాక్‌లు అధిక లాభాలను అందిస్తుంటాయి. ఇటువంటి తక్కువ లిక్విడిటీ స్టాక్‌లలో అధిక అస్థిరత పెద్ద ప్రయోజనంగా ఉంటుంది. అయితే, దీని కోసం కంపెనీ వ్యాపార నమూనా స్థిరత్వం, దాని లాభదాయకత గురించి క్షుణ్ణంగా దర్యాప్తు చేయడం అవసరం.

దీనికి అతిపెద్ద ఉదాహరణ ఎస్‌ఈఎల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ(Sel Manufacturing Co. Ltd.) షేర్లు. గత 3 నెలల్లో, ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ రూ.0.35 (NSE 27 అక్టోబర్ 2021న ముగింపు ధర) నుంచి ₹87.45 (NSE 21 జనవరి 2022న ముగింపు ధర) వరకు పెరిగింది. ఈ స్వల్ప వ్యవధిలో దాదాపు 24,900 శాతం లాభం అందించింది.

గత వారంలో, ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ మొత్తం 5 సెషన్లలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఈ కాలంలో దాని వాటాదారులకు దాదాపు 21.50 శాతం లాభాన్ని ఇచ్చింది.

షేర్ ధర చరిత్ర.. గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు (YTD) టైమింగ్‌లో, ఇది 2022కి సంభావ్య మల్టీబ్యాగర్ స్టాక్‌లలో ఒకటిగా నిలిచింది. ఇది రూ. 40 నుంచి రూ.87.45 వరకు పెరిగింది. ఈ సంవత్సరం దాని వాటాదారులకు దాదాపు 97 శాతం రాబడిని అందించింది. అందువల్ల, పెన్నీ స్టాక్‌ను 2022కి కూడా సాధ్యమయ్యే మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్‌లలో ఒకటిగా పరిగణిస్తున్నారు.

ఇది ఇప్పటికే 2021లో మల్టీబ్యాగర్ స్టాక్‌లలో ఒకటిగా నిలిచింది. ఎందుకంటే ఇది తక్కువ టైంలో రూ. 30.20 నుంచి రూ. 87.45కి పెరిగింది. ఈ సమయంలో ఈ షేర్లు దాదాపు 190 శాతం లాభం అందించాయి.

గత రెండు నెలల్లో, ఈ మల్టీబ్యాగర్ షేర్ ధర ఒక్కో షేరు స్థాయికి రూ.45 నుంచి రూ.87.45 వరకు పెరిగింది. ఈ కాలంలో దాదాపు 220 శాతం వృద్ధిని నమోదు చేసింది.

అయితే, గత 3 నెలల్లో పైన పేర్కొన్న విధంగా, ఈ పెన్నీ స్టాక్ రూ. 35 నుంచి రూ. 87.45కి పెరిగింది.

పెట్టుబడిపై ఎలాంటి ప్రభావం.. SEL మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ షేర్ ధర చరిత్రను కూడా అర్థం చేసుకుందాం. ఒక పెట్టుబడిదారుడు ఈ పెన్నీ స్టాక్‌లో వారం క్రితం రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే, అతని రూ. 1 లక్ష ఈ రోజు YTD సమయంలో రూ. 1.97 లక్షలుగా ఉండేది.

ఒక పెట్టుబడిదారుడు ఒక నెల క్రితం ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే, నేడు రూ.20 లక్షలు అయ్యేది.

అదేవిధంగా, ఒక పెట్టుబడిదారుడు 3 నెలల క్రితం ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్‌లో రూ. 1 లక్షను రూ. 35 స్థాయిలో ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఈరోజు రూ. 2.50 కోట్లుగా ఉండేది.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు సమాచారం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటుంది. ఇలాంటి స్టాక్స్‌లో పెట్టబడి పెట్టాలని భావిస్తే నిపుణులను సంప్రదించి సరైన నిర్ణయం తీసుకోండి.

Also Read: Silver Price Today: వెండి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. తగ్గిన సిల్వర్‌ రేట్లు.. ఎంతంటే..?

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో