AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Demat Account: డీమ్యాట్ అకౌంట్ తీసుకుంటున్నారా.. ఇవి గుర్తుంచుకోండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు

Stock Market: షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు డీమ్యాట్ ఖాతా తప్పక ఉండాల్సిందే. డీమ్యాట్ ఖాతా లేకుండా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ జరగదు.

Demat Account: డీమ్యాట్ అకౌంట్ తీసుకుంటున్నారా.. ఇవి గుర్తుంచుకోండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు
Demat
Venkata Chari
|

Updated on: Jan 24, 2022 | 1:09 PM

Share

Demat Account: మీరు డీమ్యాట్ ఖాతా గురించి విని ఉంటారు. కానీ, చాలా మందికి డీమ్యాట్ ఖాతా గురించి తెలియదు. వాస్తవానికి షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి డీమ్యాట్ ఖాతా తెరవాల్సి ఉంటుంది. డీమ్యాట్ ఖాతా లేకుండా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ జరగదు. డీమ్యాట్ ఖాతాను తెరిచేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

బ్రోకరేజ్, లావాదేవీల ఫీజులు.. డీమ్యాట్ ఖాతా తెరవడం, బ్రోకరేజ్ ఛార్జీలు బ్రోకర్ల మధ్య విభిన్నంగా ఉంటాయి. ప్రస్తుతం చాలా మంది ఉచిత డీమ్యాట్ ఖాతాలను తెరుస్తున్నారు. ఈక్విటీని కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి మీకు లావాదేవీ రుసుములు విధిస్తారు.

ఈ విషయాలను కచ్చితంగా చెక్ చేయండి..

డీమ్యాట్ ఖాతా రుసుములు, వార్షిక నిర్వహణ ఛార్జీలు, లావాదేవీల రుసుములకు సంబంధించి బ్రోకర్ల మధ్య పెద్ద వ్యత్యాసం ఉండవచ్చు.

బ్రోకరేజ్ హౌస్ మీకు ఎలాంటి సౌకర్యాలు ఇస్తుందో తెలుసుకోవాలి.. ఈక్విటీ బ్రోకింగ్ సేవతో పాటు, కొన్ని బ్రోకరేజ్ హౌస్‌లు అనేక ఇతర సేవలను కూడా అందిస్తాయి.

అనేక బ్రోకరేజ్ సంస్థల మాదిరిగానే మీకు ఎప్పటికప్పుడు పరిశోధనలు అందిస్తూ ఉంటాయి. ఈ పరిశోధన మీకు సరైన షేర్లలో పెట్టుబడి పెట్టడానికి సహాయపడుతుంది.

మీ బ్రోకర్ మీకు 2-ఇన్-1 డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాను ఇస్తే ఉత్తమంగా ఉంటుంది.

ట్రేడింగ్ ఖాతా లేకుండా డీమ్యాట్ ఖాతా అసంపూర్ణంగా ఉంటుంది.

మీరు డీమ్యాట్ ఖాతాలో డిజిటల్ రూపంలో మాత్రమే షేర్లను కలిగి ఉండగలరని గుర్తుంచుకోవాలి.

ట్రేడింగ్ ఖాతాతో, మీరు షేర్లు, IPOలు, మ్యూచువల్ ఫండ్స్, బంగారంలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఆ తర్వాత వాటిని డీమ్యాట్ ఖాతాలో ఉంచుకోవచ్చు.

పోర్ట్‌ఫోలియో సమాచారం కూడా అవసరం..

కొన్ని బ్రోకరేజీ సంస్థలు మీ పోర్ట్‌ఫోలియో సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంటాయి. ఇది పెట్టుబడి నుంచి వచ్చే రాబడిని ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది.

Also Read: Budget 2022: బడ్జెట్ పై కోటి ఆశలతో చిన్న రైతులు.. రాబోయే బడ్జెట్ నుంచి వారు కోరుకునేది ఏమిటి?

Best Mileage Scooters: 100 సీసీలో 64 కి.మీ మైలేజ్ అందించే స్కూటర్లు.. టాప్ 3లో ఏమున్నాయంటే?