Fire Accident: ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఏడు ఫైరింజన్ల సాయంతో..

Fire Accident: దేశ రాజధాని న్యూఢిల్లీలోని సఫ్దర్‌గంజ్ ఆస్పత్రిలోకి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో..

Fire Accident: ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఏడు ఫైరింజన్ల సాయంతో..
Follow us

|

Updated on: Jan 14, 2021 | 5:01 PM

Fire Accident: దేశ రాజధాని న్యూఢిల్లీలోని సఫ్దర్‌గంజ్ ఆస్పత్రిలోకి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆస్పత్రిలోని నాలుగవ అంతస్థులో గల నర్సింగ్ రూమ్‌లో మంటలు అంటుకున్నాయి. అవి కాస్తా దావానంలా వ్యాపించాయి. దాంతో ఆస్పత్రిలోని నాలుగవ అంతస్థు మొత్తం దట్టమైన పొగ కమ్ముకుంది. వెంటనే అప్రమత్తమయిన అధికారులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సైతం క్షణాల వ్యవధిలోనే ఆస్పత్రికి చేరుకున్నారు. ఏడు ఫైరింజన్ల సాయంతో యుద్దప్రాతిపదికన మంటలను ఆర్పేందుకు కృషి చేశారు.

చివరికి వారి కృషి ఫలించి మంటలు అదుపులోకి వచ్చాయి. దాంతో అధికారులు, ఆస్పత్రివర్గాలతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి అపాయం కలగలేదని అధికారులు ప్రకటించారు. అయితే ఆస్పత్రిలో మంటలు ఎలా అంటుకున్నాయనే విషయం తెలియాల్సి ఉంది. ఈ అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమిక అంచనా వేస్తున్నారు అధికారులు.

Also read:

టీమిండియా ఆఖరి పోరు.. పొంచి ఉన్న వాన గండం.. ఆసీస్‌కు ఘన రికార్డు..

తెలంగాణలో కోవాగ్జిన్‌ టీకా వేసుకునే వారికి అంగీకారపత్రం తప్పనిసరి: వైద్యారోగ్య శాఖ